
revanth reddy super counter to minister harish rao
Revanth Reddy : రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆయనే పెద్ద దిక్కు అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో పుంజుకుంటోంది. అందులోనూ కర్ణాటకలో పార్టీ గెలవడం చాలా ప్లస్ అయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేయడమే కాదు.. బీఆర్ఎస్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఎన్నికల ముందు రైతు బంధు విడుదల చేయకుండా.. రైతు బంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ లేఖ రాసినట్టు తెలుస్తోంది. దానిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. మీరు ఇవ్వడం చేతగాదు.. ఇచ్చే వాళ్లను ఆపుతున్నారు.. రైతులను ఆదుకోవడం తప్పా? రైతులను ఆదుకుంటుంటే.. మీకు ఎందుకు నొప్పి అవుతోంది అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రైతాంగానికి ఇచ్చే సాయం వృథా ఖర్చు తప్పితే ఇంకేం కాదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధును తీసేస్తారని తెలిసిపోతోందని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతుల జోలికి వస్తే డిపాజిట్లు కూడా దక్కవు.. అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రైతు బంధు పథకం కేవలం ఓట్ల కోసం తెచ్చింది కాదు. కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, అధికార జీతాల్లో కోతలు పెట్టి మరీ రైతు బంధు ఇచ్చాం. రైతులంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారన్న కోపంతోనే రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని, దీంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను ఆడ్డుకుంటారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
రైతు బంధు ఆపమని కాంగ్రెస్ కోరలేదు. పథకాలకు సంబంధించిన నగదును నవంబర్ 2 లోపు విడుదల చేయాలని మాత్రమే కోరామని.. రేవంత్ రెడ్డి చెప్పారు. మా పార్టీ డిమాండ్ పై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ పై తమ్ముడు ప్రచారం చేస్తున్న అధికార పార్టీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరితే ఒక విష ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టింది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.