Bithiri Sathi : బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజలకు బాగా కావాల్సిన వ్యక్తి. తీన్మార్ వార్తల పేరుతో బిత్తిరి సత్తి చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన అసలు పేరు రవి కుమార్. కానీ.. ఆయనకు బిత్తిరి సత్తి పేరు బాగా అచ్చొచ్చింది. దీంతో అదే పేరును కంటిన్యూ చేస్తున్నాడు. ఒకప్పుడు బుల్లితెరకు మాత్రమే పరిచయం అయిన బిత్తిరి సత్తి ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్లాడు. సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇటీవలే సీఎం కేసీఆర్ ను కలిశాడు. సీఎం కేసీఆర్ ను కలిసి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు సమాయత్తం అవుతున్నాడు బిత్తిరి సత్తి. అంతే కాదు.. బీఆర్ఎస్ లో చేరకముందు బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బిత్తిరి సత్తి.. తాజాగా బీఆర్ఎస్ లో చేరుతుండటం వల్ల బీఆర్ఎస్ పై ఒక్కసారిగా ప్రేమ కురిపిస్తున్నాడు.
ఇదివరకు బీఆర్ఎస్ ను తిట్టిన బిత్తిరి సత్తి వీడియోను సోషల్ మీడియాలో తాజాగా వైరల్ చేస్తున్నారు. ముదిరాజ్ ల ఆత్మ గౌరవ సభకు హాజరైన బిత్తిరి సత్తి.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. జై ముదిరాజ్ అంటూ నినాదాలు చేసిన బిత్తిరి సత్తి.. మూడు పూటలు కౌసు తిన్నవాళ్లం.. మన గుండె గట్టిగా ఉంటది. మంది గుండెలను కాపాడటానికి ఒమోగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉండే చేపలు పడుతున్నాం కదా. మేము చాలా బాధపడుతున్నాం. 20 ఏళ్ల కింద సభ పెట్టాం. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ముదిరాజ్ సభ పెట్టుకున్నాం. ఈ 20 ఏళ్లలో ఏం జరగలేదు. 2043 లో పెట్టుకున్నా కూడా ఏం జరగదు. ముదిరాజ్ లకు ఏం కావాలి? ఈ ప్రభుత్వాలు ఏం ఇచ్చాయి? ఒక్క ఉదాహరణ చెబుతా వినండి. మేమంతా 50 నుంచి 60 లక్షల మంది జనాభా ఉంటే ఆ 115 స్థానాల్లో ఒక్కటి కూడా పెట్టలేదు. కామారెడ్డి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేము పొట్టలో పెట్టుకొని చూసుకుంటాం. నామినేటెడ్ పదవులు ఇస్తం అని మాట్లాడుతున్నారు. నామినేటెడ్ వద్దు.. పోటీ పడే పదవులు ఇవ్వండి అని బిత్తిరి సత్తి డిమాండ్ చేశాడు.
నిన్న మొన్నటి దాకా సత్తిగాడు గట్టిగా మాట్లాడిండు.. గజం గజం ఎగిరిండు అని అనుకున్నరు కదా. మాకు ఉన్న బాధ చెప్పుకున్నాం. నేను అమ్ముడు పోలేదు. నేను తెలంగాణ తల్లి పాలు తాగిన వాడిని లెక్క.. కేసీఆర్ ఒక మాట అన్నారు మొన్న. నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పారు. కొట్లాడినవాడు ఉండాలి కానీ.. మాట్లాడేటోడు కాదు అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆయన ఆరోజు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చారు అని బిత్తిరి సత్తి స్పష్టం చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.