KCR Ys Jagan : కేసీఆర్, జగన్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.!
KCR Ys Jagan : ఏపీ, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు సీఎం అయ్యాడు. అయితే ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ బీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అయింది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ కేసీఆర్, జగన్ అడుగులు వేసారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పాలకులతో వైరం పెంచుకుని, వారిని దుర్భాషలాడే కేసీఆర్‌తో రాష్ట్రవిభజన తర్వాత జగన్ స్నేహం మొదలుపెట్టడం ఏపీ ప్రజలను అవమానించినట్టు అయిందని కొందరు భావించారు.
అధినేతల పోకడలు జనాలకి నచ్చలేదు.ఇద్దరు నేతలూ సామాన్యులు కాదు. ఒకనాడు కాలానికి ఎదురొడ్డి నిలిచిన నేతలు. ఇపుడు పరాజితులు. తెలంగాణా రాష్ట్రం అన్న కలను నెరవేర్చిన కేసీఆర్ రాదు అనుకున్న తెలంగాణని తెచ్చి తానేంటో చూపించారు. సకల జనుల సమ్మెని చేయించి అందరినీ తన వైపునకు తిప్పుకుని తెలంగాణ అంటే కేసీఅర్ అన్నట్లుగా మారారు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో సోనియాగాంధీ తెలంగాణాను రాష్ట్రంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణా ఉద్యమంలో అన్ని సంఘాల మద్దతు కేసీఆర్ కి లభించింది. అలా అందరి వాడుగా ఆయన ముందు వరసలో ఉన్నారు. కీర్తించబడ్డారు. ఆ క్రమంలో సీఎం పీఠం కూడా అధిరోహించారు. పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అధికారంలోకి వచ్చిన తరువాత తనదైన ముద్రతో పాలన చేశారు కేసీఆర్.
KCR Ys Jagan : కేసీఆర్, జగన్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.!
అసలు తెలంగాణాలో ప్రతిపక్షాలు అన్నవి లేకుండా చేశారు. తెలంగాణాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలుపుతోందని కేసీఆర్ ఆనాడు ఎన్నికల స్లోగన్ అందుకున్నారు. అది భావోద్వేగాలను తెలంగాణాలో రేపింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం , ఆయన ప్రజలతో మమేకం కాకపోవడం , గద్దర్ వంటి ప్రజా గాయకులను దూరం పెట్టడం కోదండరాం లాంటి ప్రజా నాయకులను దూరం చేసుకోవడం, కుటుంబ పాలన చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కేసీఆర్‌పై నెగెటివిటీ ఏర్పడింది. అదే సమయంలో ప్రజల దగ్గరకు పార్టీని తీసుకుని వెళ్ళి కేసీఆర్ పాలన మీద ఉద్యమించిన రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు.ఇక జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికల ముందు రెండేళ్ళ పాటు పాదయాత్ర చేసి జనంతో పాటే అన్నట్లుగా తిరిగారు.ఈ క్రమంలో అదికారంలోకి వచ్చారు. అధికారంలోకి జగన్ వచ్చాక ప్రజలని పట్టించుకోకుండా అప్పులు చేసి బటన్ నొక్కుతూ సంక్షేమం అంటూ ముందుకు పోయారు. తన సొంత మీడియాకు ప్రభుత్వం ద్వారానే సాలరీస్ ఇచ్చారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకుని రాష్ట్రమంతా తన ఎస్టేట్ గా పాలన చేస్తున్న జగన్ విధానాలను నిరసిస్తూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
This website uses cookies.