KCR Ys Jagan : కేసీఆర్, జ‌గ‌న్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR Ys Jagan : కేసీఆర్, జ‌గ‌న్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR Ys Jagan : కేసీఆర్, జ‌గ‌న్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.!

KCR Ys Jagan : ఏపీ, తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వాలు కొలువుదీరాయి.తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే, ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం త‌ర‌పున చంద్ర‌బాబు సీఎం అయ్యాడు. అయితే ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ బీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అయింది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ కేసీఆర్, జ‌గ‌న్ అడుగులు వేసారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పాలకులతో వైరం పెంచుకుని, వారిని దుర్భాషలాడే కేసీఆర్‌తో రాష్ట్రవిభజన తర్వాత జగన్ స్నేహం మొదలుపెట్టడం ఏపీ ప్రజలను అవ‌మానించిన‌ట్టు అయింద‌ని కొంద‌రు భావించారు.

KCR Ys Jagan : ఆ ప‌నుల వ‌ల్లే..

అధినేతల పోకడలు జ‌నాల‌కి న‌చ్చ‌లేదు.ఇద్దరు నేతలూ సామాన్యులు కాదు. ఒకనాడు కాలానికి ఎదురొడ్డి నిలిచిన నేతలు. ఇపుడు పరాజితులు. తెలంగాణా రాష్ట్రం అన్న కలను నెరవేర్చిన కేసీఆర్ రాదు అనుకున్న తెలంగాణ‌ని తెచ్చి తానేంటో చూపించారు. సకల జనుల సమ్మెని చేయించి అందరినీ తన వైపునకు తిప్పుకుని తెలంగాణ అంటే కేసీఅర్ అన్నట్లుగా మారారు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో సోనియాగాంధీ తెలంగాణాను రాష్ట్రంగా ప్రకటించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణా ఉద్యమంలో అన్ని సంఘాల మద్దతు కేసీఆర్ కి లభించింది. అలా అందరి వాడుగా ఆయన ముందు వరసలో ఉన్నారు. కీర్తించబడ్డారు. ఆ క్ర‌మంలో సీఎం పీఠం కూడా అధిరోహించారు. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు. అధికారంలోకి వచ్చిన తరువాత తనదైన ముద్రతో పాలన చేశారు కేసీఆర్.

KCR Ys Jagan కేసీఆర్ జ‌గ‌న్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే

KCR Ys Jagan : కేసీఆర్, జ‌గ‌న్‌ల మీద సానుభూతి ఎందుకు పోయిందంటే.!

అసలు తెలంగాణాలో ప్రతిపక్షాలు అన్నవి లేకుండా చేశారు. తెలంగాణాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలుపుతోందని కేసీఆర్ ఆనాడు ఎన్నికల స్లోగన్ అందుకున్నారు. అది భావోద్వేగాలను తెలంగాణాలో రేపింది. అయితే ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం , ఆయన ప్రజలతో మమేకం కాకపోవడం , గద్దర్ వంటి ప్రజా గాయకులను దూరం పెట్టడం కోదండరాం లాంటి ప్రజా నాయకులను దూరం చేసుకోవడం, కుటుంబ పాల‌న చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేసీఆర్‌పై నెగెటివిటీ ఏర్ప‌డింది. అదే సమయంలో ప్రజల దగ్గరకు పార్టీని తీసుకుని వెళ్ళి కేసీఆర్ పాలన మీద ఉద్యమించిన రేవంత్ రెడ్డి స‌క్సెస్ అయ్యాడు.ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే 2019 ఎన్నికల ముందు రెండేళ్ళ పాటు పాదయాత్ర చేసి జనంతో పాటే అన్నట్లుగా తిరిగారు.ఈ క్ర‌మంలో అదికారంలోకి వ‌చ్చారు. అధికారంలోకి జగన్ వచ్చాక ప్రజలని ప‌ట్టించుకోకుండా అప్పులు చేసి బటన్ నొక్కుతూ సంక్షేమం అంటూ ముందుకు పోయారు. తన సొంత మీడియాకు ప్రభుత్వం ద్వారానే సాలరీస్ ఇచ్చారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకుని రాష్ట్రమంతా తన ఎస్టేట్ గా పాలన చేస్తున్న జగన్ విధానాలను నిరసిస్తూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది