
tdp chandrababu should active other wise it will effect in ap elections
Chandrababu : తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక.. ఏపీలో ఎన్నికల సమరం ఆరంభం కానుంది. తిప్పి కొడితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. గత మూడు నాలుగు నెలల నుంచి టీడీపీ పార్టీ ఇన్ యాక్టివ్ అయిపోయింది. దానికి కారణం.. చంద్రబాబును అరెస్ట్ చేయడం. చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. దీంతో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. కానీ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. ఆయన బెయిల్ మీద బయటికి వచ్చి కూడా నెల దాటింది. అయినా కూడా చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. ఆయన పార్టీని వదిలేసి పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉన్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు పార్టీని యాక్టివ్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓడిపోక తప్పదు.
చంద్రబాబు పార్టీని, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గ స్థాయి నేతలు అయితే తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు టికెట్లు ఎవరికి ఇస్తారు.. అనేదానిపై క్లారిటీ లేదు. కొత్త వాళ్లకు ఇస్తారా? పాత వాళ్లకే ఇస్తారా? ఎవరికి ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. దీంతో అసలు ఈ పార్టీలో ఉండాలా? వద్దా.. ఎవరికి ఇస్తారు.. ఎవరికి ఇవ్వరు అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ఈనేపథ్యంలో చాలామంది నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని పార్టీని గాడిన పెట్టాలని.. ఇంకా నాలుగు నెలల సమయమే లేని కారణంగా చంద్రబాబు వెంటనే పార్టీని చక్కదిద్దే పనులు ప్రారంభించాలని అంటున్నారు.
నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఏ పనులు అయినా చేయొచ్చు. రాజకీయంగా ఆయన ఏదైనా చేయొచ్చు. సభలు పెట్టొచ్చు.. నాయకులతో మాట్లాడొచ్చు. ర్యాలీలు చేయొచ్చు.. తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ప్రకటించవచ్చు. కానీ.. చంద్రబాబు అలాంటి పనులేవీ చేయడం లేదు. మరోవైపు వైసీపీ మాత్రం దూకుడుమీదుంది. రెండోసారి కూడా గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీని టీడీపీ ఓడించేంత సత్తా ఉందా? వైసీపీ ఓడించేలా ప్రణాళికలను చంద్రబాబు ఎందుకు రచించలేకపోతున్నారు అనే విషయం ఏపీ ప్రజలకు మింగుడుపడటం లేదు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.