Ration Card : రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే..!

Ration Card : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రేషన్ కార్డుల వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త కార్డుల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన పౌర సేవలు అందించబడతాయి. ఉగాది పండుగ రోజు రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Ration Card రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే

Ration Card : రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే..!

Ration Card టెన్షన్ అక్క‌ర్లేదు..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా కార్డులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా.. లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.

దీంతో లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ- సేవ కేంద్రాల్లో సుమారు 18లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారును మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఆ ప్ర‌క్రియ కూడా పూర్తి చేస్తామ‌ని అధికారులు అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది