Ysrcp : మరో వంద రోజుల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ తమ పార్టీలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఎలాగైనా అధికారంలో రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టింది. మొదటి జాబితాలో 11 మందిని కొత్తగా ఇన్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు తాజాగా సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇందులో 27 మందిని ఇన్ చార్జి లుగా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్టులో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, అరకు, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. అలాగే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ను రాజమండ్రి సిటీకి , అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం కు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ చార్జి లుగా ప్రకటించింది.
-ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు
మార్గాన్ని భరత్ – రాజమండ్రి సిటీ (ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ)
-వంగా గీత – పిఠాపురం (ప్రస్తుతం కాకినాడ ఎంపీ)
తలారి రంగయ్య – కళ్యాణదుర్గం (ప్రస్తుతం అనంతపురం ఎంపీ)
– గొడ్డేటి మాధవి – అరకు (ప్రస్తుతం అరకు ఎంపీ) అనకాపల్లి కి మనసాల భరత్ కుమార్ ను రాజాంకు తాలె రాజేష్ ను, రామచంద్ర పురానికి పిల్లి సూర్యప్రకాష్ ను పాయకరావుపేటకు కంబాల జోగులను ప్రత్తిపాడు సుబ్బారావును, పి.గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్ ను, రాజమండ్రి రూరల్ కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, జగ్గంపేటకు తోట నరసింహంను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మిను, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డిని, కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్ ను, ఎర్రగొండపాలెం కు తాటిపర్తి చంద్రశేఖర్ ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ ను, విజయవాడ వెస్ట్ కు షేక్ ఆసిఫ్ ను, విజయవాడ సెంట్రల్ కు బెల్లంపల్లి శ్రీనివాసరావును, పాడేరుకు మత్య్తరాస విశ్వేశ్వర రాజును, పెనుకొండకు కె.వి ఉషాశ్రీ చరణ్ ను, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, మచిలీపట్నం కు పేర్ని కృష్ణమూర్తిని, గుంటూరు ఈస్ట్ కు షేక్ నూరి ఫాతిమాను ఇన్చార్జులుగా వైసీపీ నియమించింది.
1) జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
2) పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
3) పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు
4) ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్
5) కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
6) విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
7) అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
8) ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
9) అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
10) పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు
11) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
ఈ 11 మంది టికెట్లు కోల్పోయారు. అయితే మరో అయిదు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారసులకు వైసీపీ సీట్లు ఇచ్చింది. మరి మూడో లిస్టులో ఎంతమంది సిట్టింగ్ చీటీ చెరగబోతుందో మరో రెండు మూడు రోజులలో తెలియనుంది.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.