Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: May 4, 2025, 6:47 pm
  •  Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల గణన మాత్రమే జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ఓబీసీ వర్గాలు, వారి ఉపవర్గాల వివరాలు కూడా ప్రత్యేక కాలమ్‌ల ద్వారా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ గణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జియో-ఫెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఇందులో వినియోగించనున్నారు. మొత్తం మీద ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ గణన ఉపయోగపడనుంది.

Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey కులగణన సర్వేలో మీరు తప్పకుండా చెప్పవలసిన జవాబులు ఇవే

జనగణన చట్టం 1948 ప్రకారం.. ఈ గణనలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం తప్పనిసరి. ఉదాహరణకు – వయస్సు, లింగం, విద్యా స్థాయి, ఉద్యోగ వివరాలు, నివాస స్థలం, నివాస కాలం వంటి విషయాలను చెప్పకపోతే జరిమానా విధించే అవకాశముంది. కానీ మతం, ఆరోగ్య స్థితి, రాజకీయ అభిమతం వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఐచ్ఛికం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఎవ్వరూ బలవంతంగా అడగలేరు.

ఇక కుల వివరాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఈ అంశం పై స్పష్టమైన చట్టపరమైన బలవంతం లేదు. అంటే ఒక వ్యక్తి తన కులాన్ని చెప్పకపోతే, దానిపై ఎటువంటి శిక్షా విధించదగిన నిబంధన లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ద్వారా దీనిపై స్పష్టత ఇవ్వనుంది. కులం చెప్పడాన్ని తప్పనిసరిగా చేయాలా, లేక ఐచ్ఛికంగా ఉంచాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు చట్టపరమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.

Also read

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp