#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్‌లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు రవాణా చేయబడుతూ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం చిత్తూరులో మామిడి పంట విరివిగా కాపు రావడంతో స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా అధికారులు కర్ణాటక నుండి మామిడి రవాణాను నిషేధించారు. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసింది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి సాగు చేసే రైతులు ఈ ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు…
#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదొక ఏకపక్ష నిర్ణయం అని, ఇది రైతుల జీవనోపాధిని నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది సహకార భావానికి విరుద్ధంగా ఉందని, దీని వల్ల కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కూరగాయల రవాణాను అడ్డుకునే పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. కర్ణాటక CS షాలిని రజనీష్ కూడా ఏపీ CS విజయానంద్‌కు లేఖ రాసి, చిత్తూరు కలెక్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఇదిలా ఉంటే చిత్తూరు కలెక్టర్ సుమీత్ కుమార్ మాత్రం ఈ నిషేధాన్ని సమర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రవాణా జరిగితే స్థానిక రైతులకు ఇంకా తక్కువ ధరలే లభిస్తాయని, దీంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని చెప్పారు. ప్రస్తుతం కిలో తోతాపురి ధర కేవలం రూ.4కి పడిపోయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.8గా నిర్ణయించి, అందులో రూ.4ను సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తి, మార్కెట్ ధరల అంశాలపై సమగ్ర చర్చల తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎస్ వెల్లడించారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.