Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబు నాయుడుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఈ స్ప్లిట్ జడ్జిమెంట్ అంటే ఏంటి…?అసలు ఈ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేదాం. అయితే ఇలాంటి స్ప్లిట్ జడ్జిమెంట్ అనేవి చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఎంత కాదనుకున్న జడ్జిలు కూడా మనుషులే కదా వారిలో కూడా ఒక్కొక్కరికి భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇక ఈ స్ప్రిట్ జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే..మొదట చంద్రబాబు నాయుడు నుంచి అపిల్ రావడం జరిగింది.అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబు నాయుడు పై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసును అసలు పూర్తిగా కొట్టివేయాల్సిందిగా చంద్రబాబు తరఫు లాయర్లు అపిల్ చేశారు. అసలు ఎందుకు కొట్టేయమని అంటున్నారంటే స్కామ్ జరగలేదని ఇంకేదో కారణాలని కాదు.. అసలు ఎందుకు కొట్టేయమని అంటున్నారంటే చంద్రబాబును అరెస్టు చేసిన తీరు విధానం సరిగా లేదు. అదే విధంగా రాష్ట్ర గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా నేరుగా చంద్రబాబును అరెస్ట్ చేశారు. నంద్యాలలో అర్ధరాత్రి పూట చంద్రబాబుని అరెస్టు చేశారని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రిని , ఎమ్మెల్యేగా ,మంత్రిగా , ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటే కచ్చితంగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. కాబ్బటి సెక్షన్ 70-ఏ ఈయనకు వర్తిస్తుందనేే అంశాన్ని చంద్రబాబు తరఫున లాయర్లు ముందుకు తీసుకువచ్చి ఈ కేసును కొట్టేయాల్సిందిగా అపిల్ చేశారు.
ఎందుకంటే ఈ కేసు అసలు అఫీల్ లోకి రాదు. కావాలంటే మీరు తర్వాత గవర్నర్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేసుకోండి. ఎలాగో మేము స్కామ్ చేయలేదు కాబట్టి అప్పుడు మేము నిరూపించుకుంటాం. కానీ చంద్రబాబును అరెస్టు చేసిన తీరు విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ పద్ధతి కాదని మాజీ ముఖ్యమంత్రిని ఇలా అరెస్టు చేయడం న్యాయం కాదని గవర్నర్ పరిమిషన్ తీసుకోలేదు కాబట్టి సెక్షన్ 70ఏ కిందకి చంద్రబాబు గారు వస్తారనే అంశాలను తీసుకొని చంద్రబాబు లాయర్ కేసు వేశారు. అయితే సెక్షన్ 70 ఏ అంటే 2018కి ముందు పెట్టిన కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని , 2018 తర్వాత పెట్టిన కేసులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ సిఐడి చెప్పుకొస్తుంది. ఇక ఈ రెండు అంశాలు సుప్రీంకోర్టుకు వెళ్లడం. ఎన్నో వారాలు నెలల నుండి ఈ విషయం కోర్టులో నానుతూ నానుతూ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు పై తీర్పు వెలువరించింది. అయితే మొన్న ఇరుపక్ష వాదనలు విని జనవరి 16వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పిన బెంచ్ ఈరోజు తీర్పును వెలువరించే సమయంలో రెండు భిన్నమైన వాదనలను ఇద్దరు జడ్జిలు చెప్పడం జరిగింది.
ఒకరేమో జస్టిస్ బోస్ మరొకరు జస్టిస్ త్రివేది. ఇక వీరిలో ఒకరేమో త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును అప్పగించాలని ఇకపై త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును చూసుకోవాలని , తెలియజేశారు. మరొకరేమో సెక్షన్ 70-ఎ చంద్రబాబుకు వర్తించదని దానికి గల కారణాలు పాలనా పాలానా అని చెప్పుకొచ్చారు. లేదు సెక్షన్ 70-ఎ కిందకి చంద్రబాబు వస్తారని కాబట్టి మనం ఈ అపిల్ ని యాక్సెప్ట్ చేసి కేసును కొట్టేయాలని ఇంకొకరు తీర్పు చెప్పారు.అయితే ఈ తీర్పును తీసుకువెళ్లి చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇండియా లేదా త్రిసభ్య ధర్మాసనం అంటే ముగ్గురు జడ్జిలు ఉండే ప్యానెల్ లో ఈ కేసును పెట్టాలని వీరిద్దరూ తీర్పు సిఫారసు చేశారు. అయితే రెండు భిన్నమైన అభిప్రాయాలను ఇద్దరు జడ్జిలు చెప్పడాన్నే స్ప్లిట్ జడ్జిమెంట్ అంటారు. అయితే ఇలాంటి స్ప్లిట్ జడ్జిమెంట్ అనేది చాలా రేర్ గా మాత్రమే జరుగుతుంది. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానంలో ఇలాంటివి చాలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. మరి ఈ స్ప్లిట్ జడ్జిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.