
Allu Arjun : మామ జనసేనకు.. అల్లుడు వైసీపీకి.. ఏంటిది బన్నీ..?
Allu Arjun : ఇప్పుడు ఏపీలో అల్లు వర్సెస్ మెగా వార్ షురూ అయిపోయింది. అదేంటి ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది కదా అంటారా.. అదే అనుకోండి. కానీ మధ్యలో ఇప్పుడు ఈ వార్ మొదలైంది. అల్లు అర్జున్ మీద ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు పవన్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేసి సొంతంగా అల్లు బ్రాండ్ అంటూ ముందుకు వెళ్తున్నాడని వారు వాపోతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అల్లు ఆర్మీని స్థాపించడం అప్పట్లో సెన్సేషనల్. అప్పటి నుంచే ఈ కోల్డ్ వార్ నడుస్తోంది.
కాగా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని అందరికీ షాక్ ఇస్తోంది. అల్లు అర్జున్ చాలా కాలంగా సినిమాలు మాత్రమే చేసుకుంటున్నారు. ఆయన ఏనాడు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. అసలు రాజకీయాల్లోకి ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఆయన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్టు చేస్తున్నారు. ప్రస్తుతం శిల్పా రవి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. శిల్పా రవి అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు. ఈ క్రమంలోనే నిన్న అల్లు అర్జున్ శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు ఇచ్చాడు. రవిని గెలిపించాలంటూ కోరారు.
Allu Arjun : మామ జనసేనకు.. అల్లుడు వైసీపీకి.. ఏంటిది బన్నీ..?
అయితే ఇదే ఇప్పుడు మరింత వివాదాన్ని రేపుతోంది. కాగా అల్లు అర్జున్ పిల్లనిచ్చిన మామ కే చంద్రశేఖర్ అప్పట్లో మాట్లాడుతూ ఏపీలో జనసేన పార్టీ వస్తేనే మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు. అంటే ఆయన పవన్ కల్యాణ్ వల్లే మార్పు వస్తుందని.. ఆయన సీఎం కావాలంటూ కోరారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు బద్దశత్రువు లాంటి వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేస్తున్నారు. దాంతో మామ ఒక పార్టీకి అల్లు అర్జున్ ఇంకో పార్టీకి సపోర్టు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయని చెప్పుకోవాలి. చంద్రశేఖర్ గతంలో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు టికెట్ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అల్లు అర్జున్ కచ్చితంగా ఆయన తరఫున ప్రచారం చేసేవారేమో. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బన్నీ హాట్ టాపిక్ అయిపోయాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.