Categories: Newspolitics

Rajini And Lavu : లావు Vs రజని మళ్లీ ‘పల్నాటి యుద్ధం’ చూడబోతున్నామా..?

Rajini And Lavu : పల్నాటి ప్రాంతం చారిత్రకంగా యోధుల గడ్డగా పేరుపొందినది. గతంలో బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య ఏర్పడిన విభేదాలు పల్నాటి యుద్ధానికి దారి తీసినట్లుగానే, ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు గుప్పించుకుంటూ, తమ రాజకీయ స్వప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా స్టోన్ క్రషర్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ముదురుతున్నాయి.

Rajini And Lavu : లావు Vs రజని మళ్లీ ‘పల్నాటి యుద్ధం’ చూడబోతున్నామా..?

వైసీపీ హయాంలో బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి విడదల రజనీ రూ.2 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఐపీఎస్ అధికారి జాషువా కూడా ఇందులో భాగమన్న ఆరోపణలతో, ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా, ఏసీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇవన్నీ తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని విడదల రజనీ వాదిస్తోంది. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎంపీ లావు కుట్ర చేస్తున్నారని, ఇది తనపై నాటకీయంగా మోపిన కేసని ఆమె చెబుతోంది. దీనికి ప్రతిగా, లావు శ్రీకృష్ణదేవరాయులు మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విడదల రజనీనే ముందుగా రాజీ కోసం రాయబారం పంపించిందని ఆరోపించారు.

లావు, విడదల మధ్య గత ఐదేళ్లుగా తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమైన నిజం. లావు ఎంపీగా ఉన్న సమయంలో, రజనీ నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రభావం చూపే ప్రయత్నం చేయగా, ఇద్దరి మధ్య రాజకీయ వైరం పెరిగింది. రజనీ అనుచరులు లావు అనుచరులపై దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అప్పట్లో లావు రాజకీయంగా ఒత్తిడికి గురయ్యారని, ఇప్పుడు అదే వివాదం తిరిగి చెలరేగి, రాజకీయ యుద్ధానికి దారి తీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో, ఎవరికి అనుకూలంగా మారుతుందో వేచిచూడాలి.

Share

Recent Posts

Goat Milk Benefits : ఛీ ఛీ.. మేకపాలా… మాకొద్దు బాబో అనేవారు… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?

Goat Milk Benefits : ప్రతి ఒక్కరు కూడా పాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది.గేదె పాలు, ఆవు పాలు.ఈ రెండు…

18 minutes ago

Raj Gopal Reddy : రేవంత్ పై స్వరం పెంచిన రాజగోపాల్.. అసలు వార్ మొదలుకాబోతుందా..?

Raj Gopal Reddy  : తెలంగాణ Telangana CM Revanth reddy సీఎం రేవంత్ రెడ్డి "రాబోయే పదేళ్లు తానే…

1 hour ago

Loan : లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు రుణమాఫీ చేస్తుందా? లేదా?

Loan : అప్పు తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ రుణ భారం ఎవరి మీద పడుతుంది? ఇది చాలా…

2 hours ago

Fish Eyes : చేప తలను తింటారు… కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు… ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు…?

Fish Eyes : చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దానిలో ముళ్ళు ఉంటాయని కొందరు తినరు. దాని వాసన…

3 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి… ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది…?

Vastu Tips : వాస్తు శాస్త్ర నిపుణులు ఇంటి ప్రధాన ద్వారంకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇంట్లో ఆర్థిక సమస్యల…

4 hours ago

Rain Season : వర్షాకాలంలో మీ కాళ్లు చెడుతున్నాయా… అయితే,ఇదే కారణం…ఈ చిన్న టిప్స్, సమస్య చెక్…?

Rain Season : వర్షాకాలం వచ్చిందంటే రోడ్లంతా తడిగా నీటితో నిండి, బురదను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి…

5 hours ago

Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. 22,033 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌!

Jobs  : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 22,033 ప్రభుత్వ ఖాళీల…

6 hours ago

Mushroom Coffee : మష్రూమ్ కాఫీని ఎప్పుడైనా తాగారా…. దీని గురించి తెలిస్తే మతిపోతుంది…?

Mushrooms : సాధారణంగా మష్రూమ్స్ అంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటూ…

7 hours ago