Rajini And Lavu : లావు Vs రజని మళ్లీ ‘పల్నాటి యుద్ధం’ చూడబోతున్నామా..?
ప్రధానాంశాలు:
Rajini And Lavu : లావు Vs రజని మళ్లీ 'పల్నాటి యుద్ధం' చూడబోతున్నామా..?
Rajini And Lavu : పల్నాటి ప్రాంతం చారిత్రకంగా యోధుల గడ్డగా పేరుపొందినది. గతంలో బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య ఏర్పడిన విభేదాలు పల్నాటి యుద్ధానికి దారి తీసినట్లుగానే, ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు గుప్పించుకుంటూ, తమ రాజకీయ స్వప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా స్టోన్ క్రషర్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ముదురుతున్నాయి.

Rajini And Lavu : లావు Vs రజని మళ్లీ ‘పల్నాటి యుద్ధం’ చూడబోతున్నామా..?
వైసీపీ హయాంలో బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి విడదల రజనీ రూ.2 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఐపీఎస్ అధికారి జాషువా కూడా ఇందులో భాగమన్న ఆరోపణలతో, ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా, ఏసీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇవన్నీ తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని విడదల రజనీ వాదిస్తోంది. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎంపీ లావు కుట్ర చేస్తున్నారని, ఇది తనపై నాటకీయంగా మోపిన కేసని ఆమె చెబుతోంది. దీనికి ప్రతిగా, లావు శ్రీకృష్ణదేవరాయులు మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విడదల రజనీనే ముందుగా రాజీ కోసం రాయబారం పంపించిందని ఆరోపించారు.
లావు, విడదల మధ్య గత ఐదేళ్లుగా తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమైన నిజం. లావు ఎంపీగా ఉన్న సమయంలో, రజనీ నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రభావం చూపే ప్రయత్నం చేయగా, ఇద్దరి మధ్య రాజకీయ వైరం పెరిగింది. రజనీ అనుచరులు లావు అనుచరులపై దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అప్పట్లో లావు రాజకీయంగా ఒత్తిడికి గురయ్యారని, ఇప్పుడు అదే వివాదం తిరిగి చెలరేగి, రాజకీయ యుద్ధానికి దారి తీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో, ఎవరికి అనుకూలంగా మారుతుందో వేచిచూడాలి.