
Allu Arjun : ఓ రేంజ్‌లో బూతులు తిట్టుకుంటున్న పవన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఏమైంది వీళ్లకి..!
Allu Arjun : గత కొన్ని నెలలుగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వైరానికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏపీ ఎన్నికల తర్వాత అల్లు అర్జున్ చేసిన పని మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మరింత దూరం పెరిగేలా చేసిందని కొందరు చెబుతున్నమాట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్… నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లడం వివాస్పదం అయ్యింది. ఇది ఎవరికి మింగుడుపడలేదు. మెగా అభిమానులు, జనసేన నాయకులు తెగ తిట్టిపోసారు.నాగబాబు పోలింగ్ ముగిశాక సాయంత్రం అల్లు అర్జున్ పై పరోక్షంగా సెటైర్ వేశాడు.
ఆయన ట్వీట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడ్డారు. దాంతో ఆయన సదరు ట్వీట్ డిలీట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ స్వీకార కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ ఎవరు హాజరు కాకపోవడంతో సాయి ధరమ్ తేజ్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డిని అన్ ఫాలో చేశాడు. మెగా హీరోలు అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారని ఈ పరిణామం తెలియజేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు, మెగా ఫ్యాన్స్ మీద గట్టి వార్ నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఎక్స్ లో స్పేస్ లు కండక్ట్ చేస్తున్నారు. ఈ స్పేస్ లలో అల్లు అర్జున్ ని, ఆయన ఫ్యాన్స్ విపరీతంగా తిడుతున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫాన్స్.. పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ ని తిడుతున్నారు.
Allu Arjun : ఓ రేంజ్‌లో బూతులు తిట్టుకుంటున్న పవన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఏమైంది వీళ్లకి..!
ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకుంటూ నేరుగా కూడా తిట్టుకుంటున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్వహిస్తున్న స్పేస్ ల లోకి ఎంటర్ అయితే దారుణమైన పదాలు, బూతులు వినాల్సి వస్తుంది. ఫ్యాన్ వార్ పేరుతో కోపం, ద్వేషం స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ ఎంత వరకు వెళుతుందో అర్థం కావడం లేదు. అల్లు అర్జున్ ప్రవర్తన చూస్తుంటే కొన్నాళ్లుగా ఆయన మెగా బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నాడు. తన ఫ్యాన్స్‌ని ఆర్మీగా పిలుచుకుంటూ తనకి సరికొత్త సామ్రాజ్యం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతుంది. పుష్ప 2 విజయం సాధిస్తే అల్లు అర్జున్ రేంజ్ అంచనా వేయడం కష్టమే.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.