Categories: Newspolitics

Allu Arjun : అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుంది.. బలవంతంగా చిరు దగ్గరకు వెళ్లాడా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన లెక్క ఒకటైతే ఆ సినిమా ప్రీమియర్ షోలో మహిళ మృతికి తను కూడా కారణమని అరెస్ట్ చేయడం మరో లెక్క అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ ని తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా సైతం తప్పుబట్టింది. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి అల్లు అర్జున్ ఒక్కడే ఎలా కారణమవుతాడని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కావాలని ఈ అరెస్ట్ చేయించాడని వార్తలు రాసుకొచ్చారు. అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఈగో హర్ట్ అయ్యి ఇలా చేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఐతే ఈ విషయంపై ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా పలు రకాలుగా స్పందించారు. ఐతే 12 గంటల జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన తర్వాత పరిశ్రమ మొత్తం వచ్చి అతనికి సపోర్ట్ గా నిలిచింది. ఆ టైం లో ఒక్క మెగా హీరో అల్లు అర్జున్ ఇంటికి రాలేదు.

Allu Arjun : అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుంది.. బలవంతంగా చిరు దగ్గరకు వెళ్లాడా..?

Allu Arjun వారిని కలవడం కూడా అల్లు అర్జున్ కి ఇష్టం లేదని..

అల్లు అర్జున్ అరెస్ట్ అన్నప్పుడు చిరంజీవి, నాగ బాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఐతే రిలీజ్ అయ్యాక నెక్స్ట్ డే చిరంజీవి, నాగ బాబు ఇంటికి అల్లు అర్జున్ ప్రత్యేకంగ వెళ్లి కలిశాడు. ఐతే వారిని కలవడం కూడా అల్లు అర్జున్ కి ఇష్టం లేదని బలవంతంగా కలిశాడని అంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినా అల్లు అర్జున్ ని కలవలేదు. మళ్లీ తిరిగి అమరావతి వచ్చేశాడు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంతో మెగా, అల్లు ఫ్యామిలీస్ దగ్గరైనట్టు అనిపించినా ఎక్కడో ఒక చిన్న తేడా కనిపిస్తుంది. పుష్ప 2 లో బాస్ మీద అల్లు అర్జున్ వేసిన డైలాగ్స్ కి మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

చిరు అంటే అభిమానం ఉన్న బన్నీ బాస్ అంటే ఆయన్నే అనుకుంటారన్న ఆలోచన ఎందుకు రాలేదన్నది మెగా ఫ్యాన్స్ వాదన. అంతేకాదు ఈవెంట్ లో మాట్లాడేప్పుడు తక్కువ మాట్లాడినా పర్లేదు కానీ ఇలా పేర్లు మర్చిపోయి అనవసరమైన ఇష్యూస్ లో ఇరుక్కోకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుందో కానీ ఆయన మాత్రం ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడని అనిపిస్తుంది. ప్రీమియర్ షో టైం లోనే ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుపుకుంటున్న శ్రీ తేజ్ గురించి అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారని.. ఆయన్ను కలవాలని ఉన్నా లీగల్ ఇష్యూస్ వల్ల కలవలేకపోతున్నా అన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ కి ఈ గొడవ పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. Allu Arjun, Allu Arjun Arrest, Chiranjeevi, Pawan Kalyan

Recent Posts

Rajagopal : అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతా – కోమటిరెడ్డి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…

7 hours ago

AP Police Recruitment Board : ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…

10 hours ago

Laptop | ల్యాప్‌టాప్ వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా.. అయితే ఇలా చేయండి..!

Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధార‌ణంగా జ‌రిగేదే. పాస్‌వర్డ్ మ‌రిచిపోయిన‌ప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…

11 hours ago

SIIMA | సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఉత్తమ నటి సాయి పల్లవి

SIIMA | 'సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…

12 hours ago

BCCI | బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

ప్ర‌పంచంలోనే ధ‌నిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్ర‌స్తుతం బీసీసీఐ ఖాతాలో…

13 hours ago

Ponguleti srinivas reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ .. లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం

Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…

14 hours ago

Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. ప్రోమోతో అంద‌రిలో స‌స్పెన్స్

Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…

15 hours ago

Coconut| ప‌రిగ‌డ‌పున కొబ్బ‌రి తింటే అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…

16 hours ago