Allu Arjun : అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుంది.. బలవంతంగా చిరు దగ్గరకు వెళ్లాడా..?
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుంది.. బలవంతంగా చిరు దగ్గరకు వెళ్లాడా..?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన లెక్క ఒకటైతే ఆ సినిమా ప్రీమియర్ షోలో మహిళ మృతికి తను కూడా కారణమని అరెస్ట్ చేయడం మరో లెక్క అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ ని తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా సైతం తప్పుబట్టింది. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి అల్లు అర్జున్ ఒక్కడే ఎలా కారణమవుతాడని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కావాలని ఈ అరెస్ట్ చేయించాడని వార్తలు రాసుకొచ్చారు. అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఈగో హర్ట్ అయ్యి ఇలా చేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఐతే ఈ విషయంపై ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా పలు రకాలుగా స్పందించారు. ఐతే 12 గంటల జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన తర్వాత పరిశ్రమ మొత్తం వచ్చి అతనికి సపోర్ట్ గా నిలిచింది. ఆ టైం లో ఒక్క మెగా హీరో అల్లు అర్జున్ ఇంటికి రాలేదు.
Allu Arjun వారిని కలవడం కూడా అల్లు అర్జున్ కి ఇష్టం లేదని..
అల్లు అర్జున్ అరెస్ట్ అన్నప్పుడు చిరంజీవి, నాగ బాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఐతే రిలీజ్ అయ్యాక నెక్స్ట్ డే చిరంజీవి, నాగ బాబు ఇంటికి అల్లు అర్జున్ ప్రత్యేకంగ వెళ్లి కలిశాడు. ఐతే వారిని కలవడం కూడా అల్లు అర్జున్ కి ఇష్టం లేదని బలవంతంగా కలిశాడని అంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినా అల్లు అర్జున్ ని కలవలేదు. మళ్లీ తిరిగి అమరావతి వచ్చేశాడు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంతో మెగా, అల్లు ఫ్యామిలీస్ దగ్గరైనట్టు అనిపించినా ఎక్కడో ఒక చిన్న తేడా కనిపిస్తుంది. పుష్ప 2 లో బాస్ మీద అల్లు అర్జున్ వేసిన డైలాగ్స్ కి మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
చిరు అంటే అభిమానం ఉన్న బన్నీ బాస్ అంటే ఆయన్నే అనుకుంటారన్న ఆలోచన ఎందుకు రాలేదన్నది మెగా ఫ్యాన్స్ వాదన. అంతేకాదు ఈవెంట్ లో మాట్లాడేప్పుడు తక్కువ మాట్లాడినా పర్లేదు కానీ ఇలా పేర్లు మర్చిపోయి అనవసరమైన ఇష్యూస్ లో ఇరుక్కోకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ చుట్టూ ఏం జరుగుతుందో కానీ ఆయన మాత్రం ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడని అనిపిస్తుంది. ప్రీమియర్ షో టైం లోనే ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుపుకుంటున్న శ్రీ తేజ్ గురించి అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారని.. ఆయన్ను కలవాలని ఉన్నా లీగల్ ఇష్యూస్ వల్ల కలవలేకపోతున్నా అన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ కి ఈ గొడవ పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. Allu Arjun, Allu Arjun Arrest, Chiranjeevi, Pawan Kalyan