Good News : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరాల జల్లు ప్రకటిస్తుంది. తాజాగా తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రెండు విడతలుగా ఇచ్చే సాయం తొలి దఫా నిధులు ఆరు వేల రూపాయలను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28ని నిధుల విడుదలకు ముహూర్తంగా ఎంచుకున్నారు. భూమి ఉన్న రైతులకు ఇప్పటికే ఏటా 12 వేల రూపాయాలను ప్రభుత్వం ఇస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీన్ని సంక్రాంతి నుంచి ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.
ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి, రైతుల సంక్షేమం కోసం రూ.50,953 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకి మరింత మేలు జరగాలనే సన్నాలపై క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. తద్వారా రైతులు ప్రతి ఏకరాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ అదనంగా లాభాలు అందుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో భూమి లేని పేదలను గుర్తించేందుకు ఎలాంటి సర్వే ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టలేదు. పదేళ్లుగా చాలా రకాల సర్వేలు ప్రకటించినప్పటికీ ఈ భూమి లేని నిరుపేదల విషయంలో ఎలాంటి లెక్కలు లేవని తెలుస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ఏవీ పూర్తిగా కొలిక్కి రాలేదు. వాటిని ఆధారంగా చేసుకునేందుకు కూడా వీలు లేదు. అందుకే రెవెన్యూ రికార్డులతోపాటు ఉపాధి హామీ పథకాన్ని ఆధారంగా చేసుకుంటుందా అనే అనుమానం ఉంది. అసలు అర్హులను ఎలా గుర్తిస్తారు. భూమి లేని వారిని ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తారనే చర్చ కూడా ఉంది. ఎంతలా కుదించినప్పటికీ పాతిక నుంచి 30 లక్షల కుటుంబాలకు మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. అంటే దాదాపు 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సంవత్సరానికి అంటే మూడు నుంచి 3వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాలి.
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి…
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2…
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి…
Virat kohli : టీమిండియా తీరు మారడం లేదు.రెండో టెస్ట్‌లో దారుణంగా ఓడిన ఇండియా గబ్బా వేదికగా జరగుతున్న మూడో…
Allu arjun Nagababu : గత కొద్ది రోజులుగా బన్నీ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. పుష్ప సినిమా విడుదల…
Justice : థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని…
Constipation : ఉదయం లేవగానే టీ టీ తాగకుండా ఏ పని చేయo. మరికొందరు టీతో పాటు సిగరెట్ ని…
This website uses cookies.