
Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
Wife : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీర్తెపట్టి గ్రామానికి చెందిన 35ఏళ్ల రసూల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న రసూల్ జీవితంలో పెను విషాదం మిగిలింది.
Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
అతని భార్య అమ్ముబీకి, అదే గ్రామానికి చెందిన సెలూన్ నడిపే లోకేశ్వరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాటుగా కొనసాగించేవారు. కానీ రోజురోజుకూ కలిసే తాహతాహలు పెరిగిపోవడంతో ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ కలిసి ఘోర పథకం రచించారు.
లోకేశ్వరన్ తీసుకొచ్చిన విషాన్ని మొదటగా దానిమ్మ రసంలో కలిపి భర్తకు ఇవ్వాలని అమ్ముబీ ప్రయత్నించింది. కానీ రసూల్ దానిని తాగలేకపోయాడు. వెంటనే ఆమె అది పారబోసి, భోజన సమయంలో సాంబారులో కలిపి అన్నంతో పెట్టింది. భర్త ఆ అన్నాన్ని తిని పడుకున్నాడు. ఆ రాత్రే వాంతులు మొదలై రసూల్ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మరణించాడు.
వైద్యులు రసూల్ శరీరంలో పురుగుమందు ఆనవాళ్లు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో మొదట భార్యా పిల్లల్ని ప్రశ్నించగా, అమ్ముబీ తీరుపై అనుమానం వచ్చింది. సెల్‌ఫోన్ పరిశీలనలో ఆమె, లోకేశ్వరన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ పోలీసులు కనిపెట్టారు. అందులో “దానిమ్మ రసంలో కలిపాను తాగలేదు, అందుకే అన్నంలో కలిపాను” అనే ఉండడం హత్యను బహిర్గతం చేసింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
Soaked Fennel Seeds : నేటి ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా మన ఆహారపు…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
This website uses cookies.