Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను ఎంత దారుణంగా చంపిందో .. ఇలాంటి వారు కూడా ఉంటారా ?

Wife  : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీర్తెపట్టి గ్రామానికి చెందిన 35ఏళ్ల రసూల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న రసూల్ జీవితంలో పెను విషాదం మిగిలింది.

Wife ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య

Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!

Wife  : ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను ఎంత దారుణంగా చంపిందో .. ఇలాంటి వారు కూడా ఉంటారా ?

అతని భార్య అమ్ముబీకి, అదే గ్రామానికి చెందిన సెలూన్ నడిపే లోకేశ్వరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాటుగా కొనసాగించేవారు. కానీ రోజురోజుకూ కలిసే తాహతాహలు పెరిగిపోవడంతో ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ కలిసి ఘోర పథకం రచించారు.

లోకేశ్వరన్ తీసుకొచ్చిన విషాన్ని మొదటగా దానిమ్మ రసంలో కలిపి భర్తకు ఇవ్వాలని అమ్ముబీ ప్రయత్నించింది. కానీ రసూల్ దానిని తాగలేకపోయాడు. వెంటనే ఆమె అది పారబోసి, భోజన సమయంలో సాంబారులో కలిపి అన్నంతో పెట్టింది. భర్త ఆ అన్నాన్ని తిని పడుకున్నాడు. ఆ రాత్రే వాంతులు మొదలై రసూల్ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మరణించాడు.

వైద్యులు రసూల్ శరీరంలో పురుగుమందు ఆనవాళ్లు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో మొదట భార్యా పిల్లల్ని ప్రశ్నించగా, అమ్ముబీ తీరుపై అనుమానం వచ్చింది. సెల్‌ఫోన్ పరిశీలనలో ఆమె, లోకేశ్వరన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ పోలీసులు కనిపెట్టారు. అందులో “దానిమ్మ రసంలో కలిపాను తాగలేదు, అందుకే అన్నంలో కలిపాను” అనే ఉండడం హత్యను బహిర్గతం చేసింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది