Women : కేంద్రం తెచ్చిన గొప్ప స్కీమ్.. మహిళల బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు..!
Women : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం ఇప్పుడు మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో కొత్త డిపాజిట్లు.. మార్చి 31, 2025 తర్వాత నిలిపివేయబడినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఖాతాదారులు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ఉపసంహరణ ఎంపికను ఉపయోగించుకోవచ్చు.
Women : కేంద్రం తెచ్చిన గొప్ప స్కీమ్.. మహిళల బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు..!
ఇంతకుముందు నగదు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా పోస్ట్‌మాస్టర్ చెక్ ద్వారా మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉండగా, ఇప్పుడు ECS ద్వారా ఇతర బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బును బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఖాతాదారులు మరింత సౌకర్యవంతంగా తమ డబ్బుల్ని పొందొచ్చు.ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్) ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చాం.” అని జూన్ 12న ఒక ప్రకటనలో తెలిపింది.అంటే, మీ MSSC ఖాతాలోని డబ్బును ఇప్పుడు ఈసీఎస్ ద్వారా నేరుగా మీ ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు.
ఇది పోస్టాఫీస్ ఖాతాలు లేని వారికి లేదా ఇతర బ్యాంకుల్లో లావాదేవీలు ఎక్కువగా చేసే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7.5 శాతం స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. మీరు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 40 శాతం వరకు డబ్బును తీసుకోవచ్చు. ఖాతాదారు చనిపోతే, ఖాతాను వెంటనే మూసివేయొచ్చు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.