Home » News » 2025 Year Four Tragic Events In The First Half Of The Year
News

2025 Year : విషాదాన్ని నింపిన 2025.. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 14, 2025 5:31 pm
Advertisement

2025 Year  : 2025 సంవత్సరం భారతదేశ ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయే దుర్ఘటనలతో నిలిచింది. ముందుగా జమ్మూ కాశ్మీర్‌లోని పహాల్గమ్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో దాదాపు 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోగా, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా దళాలు వెంటనే స్పందించి ఆపరేషన్ చేపట్టి పరిస్థితిని నియంత్రించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.

Advertisement

2025 Year : విషాదాన్ని నింపిన 2025.. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!

2025 Year  : 2025 సగం ఏడాదిలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి

అలాగే బెంగుళూరులో RCB సక్సెస్ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట లో 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. భద్రతా లోపం వల్ల వేలాది మందిలో తొక్కిసలాట జరిగింది. ఇది ఊహించని విషాదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాట్లు, పోలీసుల నిర్లక్ష్యం, నిర్వాహకుల లోపాలు ఈ ఘటనకు కారణమయ్యాయి. ఈ ఘటన ప్రజలకు ఓ గుణపాఠంగా మిగిలిపోయే ఘటనగా ఇది నిలిచింది.

Advertisement

ఇక ముంబైలో జరిగిన లోకల్ ట్రైన్ తొక్కిసలాట ప్రమాదం, మరియు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఈ రెండు ఘోరమైన సంఘటనలు కూడా కలిచివేశాయి. ముంబై లోకల్ ట్రైన్ వద్ద జరిగిన తొక్కిసలాట లో పలువురు ప్రయాణికులు మరణించగా, మరెందరో గాయపడ్డారు. అదే విధంగా జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం మెడికల్ హాస్టల్ మీద కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక విషాద మైలు రాయిగా మిగిలింది. ఈ నాలుగు సంఘటనలు దేశ భద్రతా వ్యవస్థలపై, ఆపద సమయంలో స్పందించే విధానాలపై పలు ప్రశ్నలను రేపాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు జరగకూడదని అంత కోరుకుందాం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి