Ys sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కార్యక్రమాలలో వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విజయవాడ బస్సు యాత్రలో పాల్గొన్న జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాయి దాడిని ప్రతిపక్షాలు చేయించాయి అంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న మాట. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైయస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్నకు చిన్న రాయి తగిలితేనే హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. చిన్న రాయి దెబ్బకే విలవిల్లాడి పోతున్నారు. చిన్న రాయితో దాడి చేస్తేనే వారికి అది హత్యయత్నం లాగా కనిపించింది. కానీ తన బాబాయ్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రెడ్డిని గొడ్డలితో 7సార్లు నరికి నరికి నరికి చంపితే మాత్రం అది హత్యయత్నం లాగా ఎందుకు కనిపించలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు అంటూ “నారా సుర రక్త చరిత్ర” అంటూ సాక్షి పత్రికలో పెద్దపెద్ద పోస్టర్లు చేశారు.
అలాగే ఎలక్షన్స్ కి ముందు ఈ కేసు పై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపించారని దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిధితుడుగా చేర్చిన అవినాష్ రెడ్డిని జగన్ గారు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో ప్రజలందరకు తెలియజేయాల్సిందిగా షర్మిల కోరారు. గత 5 సంవత్సరాలుగా వారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ వైయస్ జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.