Home » Andhra Pradesh » Mla Rambabu Laid Foundation Stone For Raitu Bharosa Centre
andhra pradesh

Prakasham..జగన్ సర్కారు రైతుల పక్షం: ఎమ్మెల్యే రాంబాబు

Authored By
praveen T
The Telugu News | Published on: September 8, 2021, 6:54 pm
Advertisement

జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.

Advertisement

వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించి దిగుబడి పెంచుకునే విధంగా సూచనలిస్తున్నారు. రైతుల కోసం సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ ఒక్కడికే సాధ్యమని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి