
జిల్లాలోని పెడన పట్టణంలో నియోజకవర్గ శాసన సభ్యుడు జోగి రమేశ్ బుధవారం వైసీపీ కార్యాలయంలో ప్రజలతో ‘ముఖాముఖి’ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు తమ సమస్యలపై విన్నవించారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న శాసన సభ్యుడు జోగి రమేశ్ అప్పటికప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిష్కరించాలని శాసన సభ్యుడు వెంటనే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు చేరవేశారు. పలు సమస్యలపై ఎమ్మెల్యే ఫోన్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే ప్రజలు స్థానిక వైసీపీ నాయకులకు తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.