Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review : అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ & రేటింగ్
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review : యంగ్ హరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం .ఈ సినిమాలో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ రితికా నాయక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమాకు జై క్రిష్ సంగీతాన్ని అందించగా.ఎస్.వి.సి.సి డిజిటల్ మరియు సినిమా నిర్మాణంపై బాపినీడు.బి, సుధీర్ ఈదర నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ రోజు ఈ సినిమా విడుదల అయ్యింది.నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు బాగా వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.మొత్తానికి వివాదాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా వ్యాపించిందో చూద్దాం.
కథ : కథ విషయానికి వస్తే…అశోకవనంలో అర్జున కళ్యాణం సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తున్న అల్లు అర్జున్ (విశ్వక్ సేన్) కథను వివరిస్తుంది.ఇక అతని వయసు 34 ఏళ్లు వచ్చినా కూడా అతడికి ఇంకా పెళ్లి కాకపోవటంతో ఇంట్లో వాళ్లతో పాటు సమాజం కూడా అతడిని నానా రకాలమాటలతో ఆడిపోసుకుంటుంది. అయినా కూడా అతడు అవన్నీ పట్టించుకోకుండా తనను చేసుకోబోయే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. గోదావరి కి చెందిన పసుపులేటి మాధవి (రుక్సార్) దొరుకుతుంది.కానీ ఆమె అతడిని పట్టించుకోదు.అతడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడదు.దీంతో చివరికి అర్జున్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అసలు ఆ అమ్మాయి అతడిని ఎందుకు పట్టించుకోదో అనేది మిగిలిన కథ లో చూడాలి.
నటినటుల నటన : నటీనటుల విషయానికి వస్తే.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర, నటన హైలెట్ గా ఉంది.డైరెక్టర్ ఈ కథకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నాడు.మొత్తానికి విశ్వక్ సేన్ తన పాత్రకు న్యాయం చేశాడు.ఇక హీరోయిన్ రుక్సార్ మాత్రం తన పాత్రతో బాగా హైలెట్ గా నిలిచింది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ : టెక్నికల్ పరంగా చూస్తే.డైరెక్టర్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా చక్కను బాగానే డీల్ చేశాడు. అతేకాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా కథను చూపించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సంగీతం మాత్రం బాగా హైలెట్ గా మారింది.
ప్లస్ పాయింట్స్ : సినిమా కథ, నటీనటుల పాత్ర, సంగీతం, కామెడీ, సినిమాటోగ్రఫీ, సెకండాఫ్.
మైనస్ పాయింట్స్ : అక్కడక్కడ కాస్త స్లో గా అనిపించింది.
విశ్లేషణ : ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చూడవలసిన సినిమా.ఆలస్యంగా పెళ్లి చేసుకునే వాళ్లు పెళ్లి కోసం బాధపడుతున్న విషయాలని చూపించారు. 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాకపోవటంతో ఆ బాధను ఎలా పడతారు అనేది బాగా చూపించాడు.