Akhanda Movie Review : బాల‌కృష్ణ అఖండ మూవీ రివ్యూ

Advertisement
Advertisement

Akhanda Movie Review  : నంద‌మూరి బాల‌కృష్ణ‌ Balakrishna, టాలెంటెడ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సినిమా అఖండ. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలిచిన సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్లు, బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తుండటం ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

Akhanda Movie Review  కథ ఏమిటంటే : పోలీసులు, ఓ కరుడు గట్టిన క్రిమినల్ మధ్య జరుగుతున్న సన్నివేశాలతో చిత్రం ప్రారంభమవుతుంది. ఆ వెంటనే కథ రాయలసీమ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. మురళి కృష్ణ (బాల‌య్య) Balakrishna ఓ ఊరికి పెద్దగా ఉంటూ.. ఎక్కడ అన్యాయం జ‌రిగినా అడ్డుకుంటూ పేదలకు అండగా ఉంటుంటారు. జిల్లా కలెక్టర్ గా ఆ ప్రాంతానికి వచ్చిన శరణ్య (ప్రగ్యా జైస్వాల్) అణగారిన వర్గాలకు జరుగుతున్న ఆ అన్యాయాలపై చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆమె మురళి కృష్ణతో ప్రేమలో పడతారు. అనంతరం ఆయనను పెళ్ళాడి వైవాహిక జీవితం మొదలు పెడతారు.

Advertisement

Balakrishna Akhanda Movie Review

చిత్రం : అఖండ Akhanda Movie Review

నటీ నటులు: నందమూరి బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ , శ్రీకాంత్ , జగపతి బాబు , సుబ్బరాజు, పూర్ణ, తదితరులు.

సంగీతం : తమన్

సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి

దర్శకత్వం: బోయపాటి శ్రీను

విడుదల తేది : 02-12-2021

అదే ఊరిలో వరద రాజులు(శ్రీకాంత్) అక్రమంగా మైనింగ్ జరుపుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న మురళి కృష్ణ… వరదరాజులును అడ్డుకుని అతడిని ఎదిరిస్తాడు. మురళి కృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని ప్లాన్ వేసిన వరదరాజులు ఆయనను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు. ఇక అతని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. క్రమక్రమంగా మురళి కృష్ణ కుటుంబానికి వరదరాజులు ద్వారా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా స‌ర‌దాగా, మరికొంత ఎమోష‌న‌ల్ గా సాగిపోతుండగా ఇంట‌ర్వెల్ కి ముందు ఎవరూ ఊహించ‌ని ట్విస్ట్ వచ్చి సెకండాఫ్ పై భారీ ఉత్కంఠ‌ను రేపుతుంది.

రెండో అర్ధభాగం పూర్తిగా మరో డిఫరెంట్ జోన్ లోకి మారిపోతుంది. అఖండ‌గా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య… థియేటర్లలో పూన‌కాలు తెప్పిస్తూ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు. అసలు ఈ అఖండ ఎవరు? మురళి కృష్ణకు అతనికి సంబంధం ఏమిటి? అఖండ.. వరద రాజులకు ఎలా చెక్ పెట్టాడనేది అసలు కథ.

Akhanda Movie Review  ఎలా ఉందంటే:

బాలయ్య బాబు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బోయపాటితో కలిసి మూవీ అనౌన్స్ చేసినప్పుడే సినిమా సగం హిట్ అని అంతా అనుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. రెండు పాత్రల్లోనూ బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించారు. టైటిల్ సాంగ్ తో పాటు, జై బాల‌య్య సాంగ్ లో.. బాల‌య్య వేసిన స్టెప్పులు థియోటర్ లో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వవు. బాల‌కృష్ణ, విల‌న్ శ్రీకాంత్ మ‌ధ్య వ‌చ్చే ప్రతీ సీను అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాను వేరే లెవ‌ల్ కు తీసుకెళ్తుంది. త‌మ‌న్ నేపథ్య సంగీతంతో థియేట‌ర్లు మారు మోగిపోతాయి.

అటు సినీ ప్రియులకు, ఇటు నంద‌మూరి అభిమానుల‌కు ఇది పండ‌గ‌లాంటి సినిమా. అఘోరా పాత్రను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను దర్శకుడు బోయపాటి అద్భుతంగా తీర్చి దిద్దాడు. కరోనా రెండో దశ అనంతరం రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం… బాక్సాఫీసు వద్ద ఏమేరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి మరి.

Akhanda Movie Review  ఎవరెలా చేశారంటే :

బాలయ్య బాబు ఎప్పటిలాగే రెండు పాత్రల్లోనూ రెచ్చిపోయి నటించారు. అఘోరా పాత్రతో మరోసారి విశ్వరూపం చూపించారని చెప్పవచ్చు. బాలయ్య డైలాగ్ తో వచ్చిన ప్రతిసారీ థియోటర్ లో… జై బాలయ్య అంటూ ఆడియన్స్ అంతా పూనకాలతో ఊగిపోతారు. శ్రీకాంత్.. తనకున్న ఇమేజిని పక్కన పెట్టేసి ఈసారి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన డైలాగ్ డెలివరీతో బాలయ్యకు దీటుగా నటిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని విలన్ పాత్రలు పడతాయని ఖాయంగా చెప్పవచ్చు. శ్రీకాంత్, బాలకృష్ణ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రాణం. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటనతోనే కాక అందంతో సినిమాకు గ్లామర్ టచ్ తీసుకొచ్చారు. మిగతా వారిలో ఋషి పాత్రలో జగపతి బాబు, పూర్ణ, సుబ్బరాజు తమ తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

+ బాలయ్య అఘోర పాత్ర

+ విలన్ కు హీరోకు మధ్య వచ్చే సీన్స్

+ యాక్షన్ ఎపిసోడ్స్

+ డైలాగ్స్

+ తమన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

-ఫస్ట్ ఆఫ్ సాగతీత

– కొన్ని రొటీన్ అంశాలు

సో ఫైనల్ గా అఖండ చిత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కు పెద్ద ట్రీట్ అని చెప్పవచ్చు. బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీకి హిట్ ఇవ్వడంతో పాటు… వీరిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలిచింది.

రేటింగ్ : 3/5

Advertisement

Recent Posts

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

13 mins ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

1 hour ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

2 hours ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

3 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

4 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

5 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

14 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

14 hours ago

This website uses cookies.