Cult Movie Review : విశ్వక్‌సేన్ కల్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Cult Movie Review : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్ట్’. గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. తారక్ పొన్నప్ప, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీకేయ, అనిరుధ్ భాస్కర్, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భార్తీయ, విశాఖ్ నాయర్, చేపూరి వివేక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్లు, వరుస ప్రమోషనల్ కార్యక్రమాలతో ‘కల్ట్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా విశ్వక్‌సేన్ నటిస్తూ దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ట్విట్టర్ రివ్యూల్లో కొందరు విశ్వక్‌సేన్ మేకింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.
Cult Movie Review : విశ్వక్‌సేన్ కల్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Cult Movie Review విశ్వక్‌సేన్ మేకింగ్, యాక్షన్ సీన్స్‌పై ప్రశంసలు
ఓ నెటిజన్ స్పందిస్తూ.. విశ్వక్‌సేన్ మేకింగ్, టేకింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా ఫస్టాఫ్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా సాగిందని చెప్పారు. భారతదేశంలోనే తొలి స్లాషర్ ఫిల్మ్ అనే యూనిక్ కాన్సెప్ట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయని ప్రశంసించారు.మరో నెటిజన్ కూడా ఫస్టాఫ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా పీక్స్‌లో సాగుతోందని, ఇంకా రాలేదేంటి అని ఎదురుచూస్తున్న సమయంలో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుందని కామెంట్ చేశారు. ఆ సన్నివేశానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫైట్ సీన్స్ చాలా క్రేజీగా ఉన్నాయని పేర్కొన్నారు. సెకండాఫ్ ఎలా ఉండబోతోందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Also Read : Aadarsha Kutumbam Movie Review : ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Cult Movie Review థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌పై నెటిజన్ల ఆసక్తి
మరో ప్రేక్షకుడి అభిప్రాయం ప్రకారం.. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించిన సన్నివేశాలన్నీ సినిమాలో ఉన్నప్పటికీ, అసలు కథాంశం, దాని చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన అంశాలు థియేటర్లలో చూసినప్పుడే పూర్తిగా అర్థమవుతాయట. ఈ మధ్యకాలంలో వచ్చిన విశ్వక్‌సేన్ సినిమాలతో పోలిస్తే ‘కల్ట్’ చాలా బెటర్‌గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సినిమా పూర్తి అనుభూతి థియేటర్‌లో చూసిన తర్వాతే తెలుస్తుందని పేర్కొన్నారు.మొత్తంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన కొందరు నెటిజన్ల అభిప్రాయాల్లో విశ్వక్‌సేన్ మేకింగ్, ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్లాక్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సెకండాఫ్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇవి వ్యక్తిగత ప్రేక్షకుల అభిప్రాయాలు మాత్రమే. సినిమా పూర్తిస్థాయి టాక్, ప్రేక్షకుల స్పందన థియేటర్లలో విడుదలైన తర్వాత మరింత స్పష్టమవుతుంది . Cult Movie Review, Cult Review, Vishwak Sen Cult Movie, Cult Movie Public Talk, Vishwak Sen New Movie , Vishwak Sen , విశ్వక్‌సేన్ , కల్ట్ మూవీ రివ్యూ , కల్ట్ సినిమా సమీక్ష
