Dharmasthala Niyojakavargam Movie Review : ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 4, 2026, 10:02 am
  •  Dharmasthala Niyojakavargam Movie Review కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న సినిమాల్లో ‘ధర్మస్థల నియోజకవర్గం’ కూడా ఒకటి. ముఖ్యంగా ‘రంగస్థలం’ తర్వాత ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు

Dharmasthala Niyojakavargam Movie Review : కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న సినిమాల్లో ‘ధర్మస్థల నియోజకవర్గం’ కూడా ఒకటి. ముఖ్యంగా ‘రంగస్థలం’ తర్వాత ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు అదే స్థాయిలో సాహిత్యం అందించానని చెప్పడం, మొదటి నుంచి చిత్రబృందానికి అండగా నిలుస్తూ ప్రోత్సహించడం సినిమాపై అంచనాలను పెంచింది. సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు వంటి నటులతో పాటు సీనియర్ నటి కస్తూరి ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించడంతో అసలు సినిమాలో ఏం కొత్తగా చూపించబోతున్నారనే ఆసక్తి మొదలైంది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్, విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. భారీ తారాగణంతో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ పొలిటికల్ డ్రామా.. ఏర్పడిన అంచనాలను అందుకుందా? సుమన్, సాయికుమార్ పోటాపోటీ నటన ఎలా ఉంది? దర్శకుడు ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారు? అనే విషయాలను ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

Dharmasthala Niyojakavargam Movie Review : ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Dharmasthala Niyojakavargam Movie Review : ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Dharmasthala Niyojakavargam Movie Review కథ ఏంటి?

ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సంవత్సరాలుగా పోటీ లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తూ తిరుగులేని నాయకుడిగా కొనసాగుతుంటాడు బైరాజ్‌ (సాయికుమార్). అయితే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం కంటే తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవడంపైనే అతని దృష్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిదోసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. దేవకి, వసుదేవుల అష్టమ సంతానమైన శ్రీకృష్ణుడు కంసుడిని అంతం చేసినట్టుగా.. ఎనిమిదోసారి బైరాజ్‌కు ఓ సామాన్యుడు గట్టి షాక్ ఇస్తాడు.టీ షాపు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్) చేతిలో బైరాజ్ ఘోర పరాజయం చవిచూస్తాడు. అసలు ఒక సాధారణ టీ షాపు నడిపే వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈశ్వరయ్య కుమారుడు బద్రి (నటరాజ్) చనిపోవడానికి అసలు కారణమేంటి? కాలేజ్ లెక్చరర్ అరుంధతి (వితికా షేరు) ఏ సమస్యపై పోరాటం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ధర్మస్థల నియోజకవర్గం’ కథ.ప్రస్తుత కాలేజీల్లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల సమస్య, రాజకీయ నాయకులు డబ్బు కోసం ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు వంటి అంశాలను ఒకే కథలో మేళవించే ప్రయత్నం చేశారు దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట. సినిమా యాక్షన్, డ్రామాతో పాటు సామాజిక సందేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేలా కథను రూపొందించారు.

సుమన్, సాయికుమార్ నటన ఎలా ఉంది?

సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ఈ సినిమాలో తమ పాత్రలతో పోటీపడి నటించారు. ఒకవైపు సాధారణ టీ షాపు నడుపుకునే ఈశ్వరయ్యగా సుమన్ కనిపిస్తే.. మరోవైపు అధికారమే లక్ష్యంగా ఉన్న రాజకీయ నాయకుడు బైరాజ్‌గా సాయికుమార్ కనిపిస్తారు. సాయికుమార్ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ ఆయన చెప్పే డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఈశ్వరయ్య పాత్రలో సుమన్ మరోసారి తన నటనా వైవిధ్యాన్ని చూపించారు. ముఖ్యంగా ఒక సాధారణ వ్యక్తి నుంచి రాజకీయ పోరాటంలోకి అడుగుపెట్టే పాత్రలో ఆయన చూపించిన పరిణామం ఆకట్టుకుంటుంది.ఇక వితికా షేరు పాత్రకు దర్శకుడు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. సమాజం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తాపత్రయపడే కాలేజ్ లెక్చరర్‌గా ఆమె కనిపిస్తారు. తన చుట్టూ జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తూ, మార్పు కోసం పోరాడే అరుంధతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

సుమన్ కుమారుడు బద్రి పాత్రలో నటరాజ్ కనిపించారు. టాలెంటెడ్ నటుడు సత్య ప్రకాశ్ తనయుడైన నటరాజ్‌కు తెలుగులో ఇది తొలి సినిమా అయినప్పటికీ.. కొత్త నటుడిలా కాకుండా అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌లా తన పాత్రను చక్కగా మలిచారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఆయన పాత్రకు సంబంధించిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.బద్రికి ప్రేయసిగా, తోటి విద్యార్థినిగా రాయంచ కనిపిస్తుంది. ఆమెకు వచ్చిన ప్రతి సన్నివేశంలో అందంగా కనిపించడంతో పాటు తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేసింది.ఇక తొలిసారి విలన్ పాత్రలో కనిపించిన కస్తూరి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే కస్తూరి నుంచి ఇంకా కొత్తగా ఏదైనా చేయించి ఉంటే బాగుండేదనే భావన మాత్రం ప్రేక్షకుల్లో కలుగుతుంది.

వరుణ్ సందేశ్ అరుణ్ పాత్రలో కనిపించారు. ఆయన కనిపించే సన్నివేశాలు హృద్యంగా సాగుతాయి. రాజీవ్ కనకాల, శివలకు కూడా కొంత స్కోప్ ఉన్న పాత్రలు లభించాయి. ముఖ్యంగా శివ ఉపయోగించే బైక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. షఫీ, రాజా రవీంద్ర రెండు మూడు సన్నివేశాలకే పరిమితమయ్యారు. వారికి పెద్దగా చేయడానికి అవకాశం లేకపోయినా.. తమకు ఇచ్చిన పాత్రల్లో మెప్పించారు. పృథ్వీ, కాలకేయ ప్రభాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిలో ఓకే అనిపించారు.

చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ఎంత ప్లస్?

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. చిత్రబృందం మొదటి నుంచి చెప్పినట్టుగానే చంద్రబోస్ పాటలు కేవలం పాటలుగా కాకుండా కథతో కలిసి సాగుతాయి. కొన్ని సందర్భాల్లో కథను ముందుకు తీసుకెళ్లేలా ఆయన సాహిత్యం ఉపయోగపడుతుంది. ఆయన రాసిన పదాల్లో కనిపించే లోతు ఈ సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.వెంకట్ హనుమ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మహావీర్ ఎల్లంధర్ సంగీతం, అస్లాం రాసిన డైలాగ్స్ కూడా మంచి మార్కులు కొట్టేస్తాయి. ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు తమ పరిధిలో ఓకే అనిపిస్తాయి. సినిమాకు సంబంధించిన సాంకేతిక అంశాలు కథకు తగ్గట్టుగా పనిచేశాయి.నిర్మాత మేరుం భాస్కర్ విషయానికి వస్తే.. మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకుని తన అభిరుచిని చాటుకున్నారు.

Dharmasthala Niyojakavargam Movie Review : ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Dharmasthala Niyojakavargam Movie Review : ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

వాస్తవానికి ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో యూత్‌ను ఆకట్టుకునే కమర్షియల్ ప్రేమకథను కూడా ఎంచుకోవచ్చు. కానీ సమాజానికి తన వంతుగా ఏదైనా చెప్పాలనే ఆలోచనతో ఈ కథను ఎంచుకున్నట్టుగా సినిమా చూస్తే అనిపిస్తుంది.దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోటకు ఇది తొలి సినిమా. అయినప్పటికీ ఇలాంటి సామాజిక, రాజకీయ అంశాలతో కూడిన కథను ఎంచుకోవడం సాహసమే. సినిమాలో ప్రధానంగా రెండు అంశాలను టార్గెట్ చేసి వాటిని కథలో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ రెండు అంశాలకు న్యాయం చేసేలా ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు బలంగా నిలుస్తుంది.మొదటి సినిమానే అయినప్పటికీ ఇంతమంది సీనియర్, స్టార్ యాక్టర్లను డీల్ చేయడం కూడా సాధారణ విషయం కాదు. నటీనటుల పాత్రలను కథలోకి తీసుకొచ్చిన విధానం చూస్తే దర్శకుడి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

అసలు ‘ధర్మస్థల నియోజకవర్గం’ ఏం చెప్పాలనుకుంది?

ఈ సినిమాలో దర్శకుడు ప్రధానంగా ఒక విషయాన్ని బలంగా చెబుతారు. ఒక మహిళ గట్టిగా నిర్ణయించుకుంటే ఏదైనా సాధించగలదు. సమాజంలో మార్పు రావాలని నిజంగా సంకల్పిస్తే.. ఆ మార్పు రావడానికి కొంత సమయం పట్టినా చివరికి తప్పకుండా వస్తుందనే విషయాన్ని వితికా షేరు పాత్ర ద్వారా చెప్పిన విధానం బాగుంది.‘మార్పు గురువు దగ్గరే.. గురువుతోనే సాధ్యం’ అనే ఆలోచన కూడా ఆలోచింపజేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, వారిని ప్రభావితం చేస్తున్న మాదకద్రవ్యాల సమస్య వంటి అంశాలను సినిమా సీరియస్‌గా టచ్ చేస్తుంది.అలాగే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో డబ్బు కోసం కొందరు నాయకులు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారనే విషయాన్ని దర్శకుడు చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరినీ నేరుగా టార్గెట్ చేయకుండా, ఎవరినీ బాధించే విధంగా కాకుండా తన పాయింట్‌ను చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ.. చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం సూటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.రాజకీయాల్లో మంచి వ్యక్తులు ఉండి, నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తే పరిస్థితులు ఎలా మారతాయి? ప్రజలు అలాంటి నాయకులను ఎలా ఆదరిస్తారు? అనే విషయాన్ని వరుణ్ సందేశ్ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

ఇక బంగ్లాదేశ్, శ్రీలంకలో చోటుచేసుకున్న అల్లర్ల వెనుక ఎలాంటి శక్తులు పనిచేశాయి? ఆ శక్తులు ఎలా వ్యవహరిస్తాయి? అనే అంశాలను కూడా దర్శకుడు కథలో ప్రస్తావించారు. ఈ అంశాలను సినిమాలో చేర్చిన విధానం చూస్తే దేశం పట్ల దర్శకుడికి ఉన్న ఆలోచన, నిబద్ధత కనిపిస్తుంది.మొత్తంగా చూస్తే ‘ధర్మస్థల నియోజకవర్గం’ అనేది కేవలం ఒక నియోజకవర్గానికి లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన కథ కాదు. దేశం, సమాజం, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది.ఎక్కడా వల్గారిటీకి చోటివ్వకుండా.. ఒక మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసిన సినిమా కావడంతో ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా రాజకీయాలు, విద్యార్థుల భవిష్యత్తు, డ్రగ్స్ వంటి సామాజిక అంశాలపై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

ఫైనల్‌గా..

సుమన్, సాయికుమార్‌ల పోటాపోటీ నటన, వితికా షేరు పాత్ర, నటరాజ్ పెర్ఫార్మెన్స్, చంద్రబోస్ సాహిత్యం, సామాజిక సందేశం సినిమాకు ప్రధాన బలాలు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ కనిపించినప్పటికీ.. చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు సూటిగా చెప్పగలిగారు. మెసేజ్ ఓరియెంటెడ్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ధర్మస్థల నియోజకవర్గం’ ఒకసారి చూడదగిన సినిమాగా నిలుస్తుంది.

ట్యాగ్‌లైన్: ప్రతి నియోజకవర్గానికి ఒక పాఠం

రేటింగ్: 3.25/5 ⭐

No liveblog updates yet.

LIVE UPDATES

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp