
Ginna Movie Review And Rating In Telugu
Ginna Movie Review : వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే చిత్రం చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్. దీపావళి సందర్భంగా నేడు వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. జిన్నా మూవీ కి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, మంచి రెస్పాన్స్ వచ్చిందని, దీంతో థియేటర్స్ లో ఓపెనింగ్స్ అదిరిపోతాయని జిన్నా టీమ్ కాన్ఫిడెంట్ గా చెప్పారు.
జిన్నా మూవీ టీజర్, ట్రైలర్ లు చూస్తుంటే ఇది పక్కా ఎంటర్ టైనర్ అని అర్ధమవుతోంది. దీంతో ఈసారి విష్ణు హిట్ కొట్టేలా ఉన్నాడని సినీ జనాలు ముందుగానే రివ్యూలు కూడా ఇచ్చేశారు. ఈ నెల 21వ తేదీన ఏకంగా 4 సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో సినిమాలకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీపావళి పండుగ ఉండటంతో ఓరి దేవుడా, ప్రిన్స్, జిన్నా, సర్దార్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో జిన్నా సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ లేవనే సంగతి తెలిసిందే. ప్రముఖ థియేటర్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవడం గమనార్హం. చాలా తక్కువ సంఖ్యలో ఈ సినిమాకు బుకింగ్స్ జరగగా తొలిరోజు కలెక్షన్లు సైతం మరీ భారీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Ginna Movie Review And Rating In Telugu
సినిమాకు క్రిటిక్స్ నుంచి నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే జిన్నా మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.పి.ఎస్ మిత్రన్, కార్తి కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై మూవీ సర్దార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శివ కార్తికేయన్ హీరోగా, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా చిత్రంపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఇంత కాంపిటీషన్‌లో జిన్నా ఎలా నెట్టుకొస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే జిన్నాకు థియేటర్లు దొరక్కపోతే మంచు విష్ణు రియాక్షన్ ఎలా ఉంటుదో చూడాలి.
జిన్నా రివ్యూ.. బోరింగ్ హారర్ కామెడీ
సినిమా..జిన్నా
దర్శకుడు.. సూర్య
నటీనటులు..విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్
నిర్మాతలు..మంచు విష్ణు
సంగీతం.. అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ.. ఛోటా కె. నాయుడు
కథ:
తిరుపతికి చెందిన జిన్నా( మంచు విష్ణు) జీవితం సరదాగా గడపుతూ ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో అవసరం కోసం అప్పు చేస్తాడు . అయితే అప్పు తీర్చలేక నానా ఇబ్బందులు పడడం, అప్పు కట్టకుండా ఉండేదుకు తప్పించుకు తిరగడం వంటివి చేస్తుంటాడు. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తి ఒకానొక సందర్భంలో విష్ణుని పట్టుకొని అప్పు అడగగా, తాను తీర్చలేను అని చెబుతాడు. అప్పుడు తన చెల్లి(సన్నీలియోన్)ని పెళ్లి చేసుకోమని చెబుతాడు. అప్పుడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. వారి మధ్య జరిగే సంఘటనలు ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మంచు విష్ణు కొన్ని సీన్స్‌లో బాగా నటించాడు. ఢీని గుర్తు చేశాడు. అయితే సెంకడాఫ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక పాయల్ రాజ్‌పుత్‌ని ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు. సన్నీ లియోన్ మాత్రం తన గ్లామర్‌తో పాటు నటనతోను అదరగొట్టింది. ఇక వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ టీం అంతా తేలిపోయారు. దర్శకుడు సరైన ప్రతిభ కనబరచలేకపోయాడు. ఇక కోనవెంకట్ పనితనం పెద్దగా బాగోలేదు. అనూప్ సంగీతం, బీజీఎం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. చోటా కె నాయుడు మంచి విజువల్స్ అందించడంలో విఫలమయ్యాడు,
ప్లస్ పాయింట్స్:
కొంత కామెడీ
మైనస్ పాయింట్స్:
డైరెక్షన్
రొటీన్ సన్నివేశాలు
మ్యూజిక్
చివరిగా… జిన్నా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు మనం హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఒక పాట, అతని స్నేహితులతో కొన్ని కామెడీ సన్నివేశాలు, ఒక అమ్మాయి మరియు హీరోతో ప్రేమలో పడడం వంటి ఒకే ఫార్మాట్‌లో చాలా సినిమాలు చూశాము కాబట్టి సినిమా ట్రీట్‌మెంట్ పాతది అనిపించవచ్చు. కామెడీ సన్నివేశాలు మరియు బోరింగ్ స్క్రీన్‌ప్లేతో సాగింది మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను సెకండ్ హాఫ్ చూసేలా చేస్తుందని మేకర్స్ భావించారు, కానీ జానర్ కూడా పాతది కాబట్టి మనకు ఎలాంటి క్యూరియాసిటీ కలిగించదు.సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోదు అనే చెప్పాలి.
రేటింగ్2/5
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.