Karthi Sardar Movie Review : కార్తీ స‌ర్ధార్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!!

Karthi Sardar Movie Review : సూర్య సోద‌రుడిగా కాకుండా త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీ. ఈయ‌న‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊపిరి సినిమాతో పాటు ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. తాజాగా సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తి. అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యాడు. కార్తీ గొప్ప‌త‌నం గురించి చెబుతూ ఆయ‌న గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నాగార్జున కామెంట్స్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.

కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. సర్దార్ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన ‘సర్దార్’ టీజ‌ర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తీ ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. పిఎస్ మిత్రన్ తన అవుట్ స్టాండింగ్ తో ఆకట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడుదలౌతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పరచడం జరిగింది.

Karthi Sardar Movie Review And Rating In Telugu

Karthi Sardar Movie Review : మంచి స్టోరీతో..

సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ని అందించారు. ఎప్పుడో తప్పిపోయిన తండ్రి కోసం అదే వృత్తిని ఎంచుకున్న కొడుకు సాగించే అన్వేషణే ఈ సినిమా స్టోరీ అని అందుకే దగ్గరి పోలికలు ఉంటాయని సోషల్ మీడియాలో చాలా ట్విట్లు వచ్చాయి. అయితే ఇది వాస్తవం కాదట. సదరు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన రూబెన్ దీని గురించి క్లారిటీ ఇస్తూ రజనీకాంత్ విజయ్ కాంత్ ఎలా అన్నదమ్ములు కాదో ఇది కూడా అలాంటి అభూతకల్పనే తప్ప మరొకటి కాదని తేల్చేశారు. ఇక ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సర్దార్ త‌ప్ప‌క స‌క్సెస్ అవుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తున్నారు.

 

కార్తి స‌ర్ధార్ మూవీ రివ్యూ.. ఆక‌ట్టుకునే గూడాఛారి క‌థ‌

సినిమా పేరు సర్దార్
దర్శకుడు పి .స్ మిత్రన్
నటీనటులు కార్తీ, రాశిఖన్నా, రజిషా విజయన్, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్, మురళీ శర్మ
నిర్మాతలు ఎస్. లక్ష్మణ్ కుమార్
సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ జార్జ్ సి . విలియమ్స్

క‌థ‌:

చిత్రంలో కార్తీ.. విజ‌య్ ప్ర‌కాశ్ అనే పాత్ర‌లో క‌నిపించారు. ఆయ‌న సంచ‌ల‌నాల‌తో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌డం చాలా ఇష్టం. ఏదైన వండ‌ర్ సృష్టించి దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ కావాల‌ని తెగ ఆరాట‌ప‌డుతుంటాడు . అయితే ఓ సారి ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోగా, దాని కోసం సీబీఐ, రా వెతుకుతుంటాయి.ఇది తెలుసుకున్న విజ‌య్ ప్ర‌కాశ్.. అంద‌రి క‌న్నా ముందు తాను ఆ ఫైల్ కనుగొనాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. అయితే ఆ స‌మ‌యంలో త‌న తండ్రి గురించి, అత‌ని మెషీన్ గురించి తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోతాడు. అయితే ఆ త‌ర్వాత కార్తీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్:

చిత్రంలో ప్రముఖ పాత్రల్లో కార్తీ మరియు రాశిఖన్నాతో పాటు, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్ మరియు మురళీ శర్మ,ఫేమ్ రజిషా విజయన్, తదితరులు న‌టించారు. కార్తీ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించాడు. మ‌రోసారి త‌న న‌టవిశ్వ‌రూపంతో అల‌రించాడు. రాశీ ఖ‌న్నా కూడా చెప్పుకోద‌గ్గ పాత్ర‌లో మెప్పించింది. ఇక ముర‌ళీ శ‌ర్మ‌,చుంకీ పాండేతో పాటు మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే..

పి .స్ మిత్రన్ దర్శకత్వం బాగుంది. జార్జ్ సి . విలియమ్స్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించాడు, కొన్ని స‌న్నివేశాల‌ని బాగా తెర‌కెక్కించాడు జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ బాగుంది ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్

కార్తీ న‌ట‌న‌
స్టోరీ
బీజీఎం
మైన‌స్ పాయింట్స్:

సెకండాఫ్‌లోని కొన్ని స‌న్నివేశాలు

చివరిగా..

స‌ర్ధార్ చిత్రంలో కొన్ని డ్రాగీ సన్నివేశాలు ఉన్నప్పటికీ, సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్నీ అంశాలు ఉన్నాయి మరియు సరైన మొత్తంలో డ్రామా మరియు ఎమోషన్‌లు బాగా పండాయి, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కూడిన యాక్షన్ బ్లాక్‌లు మిమ్మల్ని సర్దార్ ప్రపంచంలోకి లాగేస్తాయి. అంశాలన్నీ సినిమాలో చాలా చక్కగా ప్రస్తావించబడ్డాయి. ఇది అంద‌రిని ఆక‌ట్టుకునే గూఢాచారి క‌థ‌.

రేటింగ్ 3/5

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

1 hour ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

3 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

5 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

6 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

7 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

8 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

9 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

10 hours ago