Hari Hara Veera mallu Public Talk Review : హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్.. సినిమా గురించి ఏమంటున్నారంటే.. వీడియో !
ప్రధానాంశాలు:
Hari Hara Veera mallu Public Talk Review : హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్.. సినిమా గురించి ఏమంటున్నారంటే..!
Hari Hara Veera mallu Public Talk Review : పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు థియేటర్లలో జోష్ నింపుతోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రదేశాల్లో ప్రీమియర్ షోలు పడగా, ఈరోజు ఉదయం బెనిఫిట్ షోలు కూడా గ్రాండ్‌గా జరిగాయి. అభిమానులు భారీగా థియేటర్ల వద్దకు చేరుకొని జోష్ చూపించారు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు ప్రీమియర్ షోలు పడడాయి.

Hari Hara Veera mallu Public Talk Review : హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్.. సినిమా గురించి ఏమంటున్నారంటే.. వీడియో !
Hari Hara Veera mallu Public Talk Review : పాజిటివ్ టాక్..
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వెల్లువెత్తుతోంది. పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, ఎలివేషన్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ కూడా టాప్ క్లాస్‌గా ఉన్నాయని అంటున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శకులు ఎంతో బాగుగా తెరకెక్కించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
కథనంలో ఎక్కడా లోపం లేకుండా సినిమాను కొనసాగించారని, ముఖ్యంగా ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. పార్ట్ 1 లో ప్రతి పాత్రను ఎంతో కష్టపడి డిజైన్ చేసి చూపించారని, పార్ట్ 2 లో వీటికి మరింత లోతైన వివరణ ఇవ్వనున్నారని భావిస్తున్నారు. అంతటా చూస్తే, హరిహర వీరమల్లు తొలి భాగం ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి విజయం సాధించే దిశగా సాగుతోంది అని అంటున్నారు.
