Karthi Japan Movie Review : కార్తీ అనగానే మనకు గుర్తొచ్చేవి ఒక మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. అందులో ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే.. తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ సుపరిచితమే. ఆయన తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు. అలాగే.. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్తీ. తను ఇక్కడ కూడా స్టార్ హీరో అనే చెప్పుకోవాలి. అందుకే.. కార్తీ నటించిన ఏ సినిమా అయినా తెలుగులో ఖచ్చితంగా విడుదల అవుతుంది. నిజానికి కార్తీ ఎప్పుడూ నార్మల్ ఫార్మాట్ సినిమాలు చేయడు. ఆయన ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా తీసుకున్నా అవన్నీ ప్రయోగాత్మకమైనవే. అవి సక్సెస్ అవుతాయా? లేక ఫెయిల్? అవుతాయా అనే విషయాలు పక్కన పెడితే కార్తీ మాత్రం అస్సలు నార్మల్ కథలతో సినిమాలు చేయరు. అలాంటి మరో ప్రయోగాత్మక చిత్రమే జపాన్. ఇది ఒక యాక్షన్ కామెడీ త్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కార్తీ సరన బ్యూటీఫుల్ లేడీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అను రెచ్చిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కూడా వేశారు. దీంతో సినిమా గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా 25వ సినిమా. ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకు రాజ్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు. సునీల్, విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో కార్తీ దొంగగా నటించాడు. అందులోనూ ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక తెలిసింది. టీజర్, ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక.. హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కు ఇది భారీ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఇప్పటి వరకు నటించిన సినిమాలేవీ తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అందుకే తను ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఇక.. ఈ సినిమా మరి ప్రేక్షకులను మెప్పించిందా? అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
ఈ సినిమాలో కార్తీ పేరే జపాన్. అందుకే సినిమాకు కూడా జపాన్ అని పేరు పెట్టారు. జపాన్ అంటే దేశం పేరు కాదు. చిన్నప్పటి నుంచి పొట్టకూటి కోసం ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు జపాన్. ఆ తర్వాత పూర్తిస్థాయి దొంగగా మారి పెద్ద పెద్ద దొంగతనాలకు అలవాటు పడతాడు. అప్పుడే జపాన్ కు ఒక భారీ డీల్ కుదురుతుంది. అది ఓకే అయితే మనోడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతాడు. ఒక మంత్రి ఇంట్లో ఉన్న డబ్బులు కొట్టేసే డీల్ అది. ఆ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జపాన్.. ఆ మంత్రి ఇంట్లో డబ్బులు కొట్టేస్తాడు. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్. మంత్రి ఇంట్లో అదే సమయంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసింది, దొంగతనం చేసింది రెండూ జపానే అని అనుకొని పోలీసులు జపాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే.. అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు? జపాన్ మీద ఎందుకు నెట్టారు? అక్కడ దొంగతనం చేసిన తర్వాత జపాన్ ఎక్కడికి వెళ్లాడు.. అనేదే మిగితా కథ.
కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు కార్తీ నటన ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ తను తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సినిమా ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగా పండాయి. ఈ సినిమాలో ప్రతి దొంగతనం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ.. ఆ సస్పెన్స్ కానీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక.. మ్యూజిక్ అయితే ఈ సినిమాకు సూపర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అనే చెప్పుకోవాలి. హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఈ సినిమాలో తన గ్లామర్ డోస్ ను పెంచింది. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన సునీల్ కూడా ఇరగదీశాడు. సరికొత్త సునీల్ ను మనం ఈ సినిమాలో చూస్తాం. మంగళం శీను కంటే కూడా పవర్ ఫుల్ క్యారెక్టర్. ఇక.. విజయ్ మిల్టన్ పాత్ర కూడా ఈ సినిమాలో ముఖ్యమైనదే.
ప్లస్ పాయింట్స్
కార్తీ నటన, వేరియయేషన్స్
మ్యూజిక్
బీజీఎం
స్క్రీన్ ప్లే
యాక్షన్
సస్పెన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
సాంగ్స్
లాగ్ సీన్స్
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
This website uses cookies.