Brahmamudi 10 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 10 నవంబర్ 2023, శుక్రవారం 250 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన తండ్రి సీతారామయ్య దగ్గరకు వెళ్లి తన బాధ పంచుకుంటుంది రుద్రాణి. నాకు, నా కొడుకుకు కూడా ఈ ఇంట్లో ఆస్తి హక్కు కల్పించు. ఆ మాయదారి క్యాన్సర్ వల్ల మీకు ఏదైనా జరగరానిది జరిగితే.. మాకు దిక్కు ఎవరు నాన్న. మీరు ఉండగా నాకు, నా కొడుక్కి ఎలాంటి లోటు లేకుండా ఏదో ఉన్నదాంట్లో ఆస్తి హక్కు కల్పిస్తే మంచిది. అందరితో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటే నాకు జీవితాంతం హాయిగా ఉంటుంది. మిమ్మల్నే నమ్ముకొని ఇక్కడ ఉంటున్నాను. నాకు కూడా ఆస్తిలో హక్కు కల్పించండి. ఏలోకంలో ఉన్నా నిన్ను ఇలవేల్పుగా పూజించుకుంటాను అంటుంది రుద్రాణి. తన చేతుల్లో బాండ్ పేపర్స్ పెడుతుంది. వీలునామా రాయి నాన్న. ఆ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దగ్గర ఉన్న ఫామ్ హౌస్, మామిడితోట నాకు ఇస్తే నేను చాలా సంతోషిస్తా నాన్న అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది రుద్రాణి. ఇవన్నీ ధాన్యలక్ష్మి వింటుంది. మరోవైపు రాహుల్ మందు తాగుతూ ఉంటాడు. ఏడ్చుకుంటూ వచ్చిన రుద్రాణిని చూసి మామ్ ఏడ్చావా అంటే జీవించాను అంటుంది రుద్రాణి. మీ నాన్న గారు నీ మాటలు నమ్మారా అంటే.. నమ్మేలా నటించాను అంటుంది రుద్రాణి.
ఆ తర్వాత తనకు కూడా మందు కలుపుతాడు రాహుల్. ఇద్దరూ కూర్చొని మందు తాగుతారు. మంచి వాళ్లు అంత మంచితనంతో ఎలా ఉంటారురా బాబు. అందులో కిక్ ఏముంది అంటుంది రుద్రాణి. నీకు, నాకు ఈ ఇంట్లో ఎన్నో కష్టాలు. తోడేళ్లు మేకళ్లా కనిపించడం చాలా కష్టం అంటుంది. ఇంతకీ పెద్దాయన పోకముందే మనకు ఆస్తి ఇచ్చేలా ఉన్నాడా అంటాడు రాహుల్. మనం మాట్లాడే మాటలు వింటే అందరూ గుండె ఆగి చస్తారు అంటాడు రాహుల్. మనం ఉన్నప్పుడే లైఫ్ లో చాలా హాయిగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అంటుంది రుద్రాణి. మన వాటా మనకు రాగానే ముందు నా పెళ్లాన్ని వదిలించుకొని వరల్డ్ టూర్ చేయాలి. అది నా డ్రీమ్ అంటాడు రాహుల్. అత్తయ్య గారు టిఫిన్ చేయండి అని పిలుస్తుంది కావ్య. దీంతో నువ్వు చెప్పాలా టిఫిన్ చేయాలని. మాకు తెలియదా అంటుంది అపర్ణ. ఇంతలో చంద్రశేఖర్ వస్తాడు. నాన్న గారికోసం వచ్చాను అని చెబుతాడు. దీంతో సీతారామయ్య దగ్గరికే వెళ్తాడు చంద్రశేఖర్. నాన్న లాయర్ ను ఎందుకు పిలిచాడు అని అనుకుంటారు. నేను రాత్రి నాలుగు కన్నీళ్లు రాల్చేసరికి తెల్లారేసరికి లాయర్ ను పిలిచాడు అని తన కొడుకుతో చెబుతుంది రుద్రాణి. లాయర్ సీతారామయ్య దగ్గరికి వెళ్తాడు. ఇంద్రాదేవిని బయటికి పంపిస్తాడు సీతారామయ్య.
అమ్మా.. లాయర్ ఎందుకు వచ్చాడు. నువ్వు ఎందుకు బయటికి వచ్చావు అని అడుగుతాడు సుభాష్. నేను ఎక్కడ వచ్చాను.. ఆయనే వెళ్లమన్నారు అంటుంది ఇంద్రాదేవి. ఏముంది ఆస్తులు పంచడానికేమో అంటుంది రుద్రాణి. లాయర్ గారు ఒక వీలునామా రాయండి అని చెబుతాడు సీతారామయ్య. సీతారామయ్య చెప్పినట్టు వీలునామా రాస్తాడు లాయర్.
నేను చెప్పినట్టుగా సిద్ధం చేయండి అని అంటాడు సీతారామయ్య. దీంతో సరే సార్ మీరు చెప్పినట్టుగానే అంతా సిద్ధం చేస్తాను అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయటికి వచ్చి వెళ్లొస్తాను అని అందరికీ చెప్పి వెళ్లిపోతాడు లాయర్. రుద్రాణి, రాహుల్ తెగ సంతోషిస్తారు.
ధాన్యలక్ష్మి భర్త.. లాయర్ ఎందుకు వచ్చాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆస్తి గురించి అడిగితే తప్పుగా అనుకుంటారేమో అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. నీతో ఒక్క విషయం చెప్పాలి అంటుంది. ఏంటి అంటే.. ఇందాక మామయ్య గారు లాయర్ ను పిలిపించారు కదా.. ఒక వేళ రుద్రాణి మాట నిజం అయి నిజంగానే మామయ్య గారు ఆస్తి పంపకాలు చేస్తే ఎలా అంటుంది ధాన్యలక్ష్మి.
ఒకవేళ రుద్రాణికి కూడా ఇందులో సమాన వాట అడిగితే ఎలా. అలా జరిగితే మన కళ్యాణ్ నష్టపోతాడు అంటుంది ధాన్యలక్ష్మి. అన్నయ్య ఉన్నాడు కదా. ఆయన చూసుకుంటాడులే. రాజ్ ఉన్నాడు కదా అంటాడు. కళ్యాణ్ కు అన్యాయం జరగదులే అంటాడు. ఇద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి ఉన్నారు అంటాడు.
మరోవైపు అపర్ణ.. సీతారామయ్య దగ్గరికి వెళ్లి రుద్రాణి ఏవో కాగితాలు పట్టుకొని మీ దగ్గరికి వచ్చి వెళ్లిందని తెలిసింది అంటుంది. ఏం మాట్లాడింది అని అడుగుతుంది ఇంద్రాదేవి. ఆస్తిలో వాటా అడిగిందా అంటే.. తను చెప్పాల్సింది చెప్పింది. నేను ఏం చెప్పలేదు అంటాడు సీతారామయ్య.
మన ఫ్యామిలీలో ఎప్పుడూ ఇలాంటి ఆపద రాలేదు. మొదటిసారి వచ్చింది. దీని కోసం ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టండి. చివరికి ఆస్తులు అమ్మినా పర్వాలేదు అంటుంది అపర్ణ. ఈ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా బయటికి వినిపించకూడదు. ఇప్పుడు మీ అనారోగ్యాన్ని సాకుగా చేసుకొని తనకు, తన కొడుక్కి ఒక వాటా కావాలని విప్లవం లేవనేస్తోంది.
మీ కష్టాన్ని, మీ పూర్వీకుల కష్టార్జితాన్ని మీ వారసులు రెట్టింపు చేస్తున్నారు. ఒకవేళ లాయర్ తో వీలునామా రాయించదలుచుకుంటే మాత్రం దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. రుద్రాణికి సమాన వాటా ఇచ్చినా కూడా అపాత్ర దానమే అవుతుంది. రాహుల్ దాన్ని నిలబెట్టుకోలేడు. ఎప్పుడూ పోగొట్టుకోవడమే తప్ప నిలబెట్టుకోవడం తెలియదు. ఈ ఉమ్మడి ఆస్తిని ఉమ్మడిగానే ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు కష్టపడి మీ మాట మీద అందరినీ ఒక్క తాటిమీదికి నడిపిస్తున్నారు.
అందరికీ కలిసి ఉంచేలా ఈ ఇంటి కోడలుగా నేను బాధ్యత తీసుకుంటాను. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే అధికారం నాకు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ. కోడలు చెప్పింది కరెక్టే కదా బావ అంటుంది ఇంద్రాదేవి.
అది నాకు తెలుసు. రేపటి వరకు వెయిట్ చేయి అంటాడు సీతారామయ్య. మరోవైపు ఎంత కాస్ట్ అయినా డాక్టర్ ను పిలిపించు అని ఫోన్ లో మాట్లాడుతాడు రాజ్. నువ్వే నా లాస్ట్ హోప్ అంటాడు రాజ్. తాతయ్య లాయర్ ను పిలిపించిన విషయం.. ఈయనకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య.
ముందు భోం చేయండి అంటుంది. దీంతో నువ్వు చేసింది నేను తినను అంటాడు రాజ్. నా మీద కోపం అన్నం మీద చూపిస్తున్నారా అంటే అవును అంటాడు రాజ్. ఆ కోపం నామీద చూపించండి భరిస్తాను. ముందు అన్నం తినండి అంటే.. వద్దమ్మా అంటాడు రాజ్.
మరోవైపు వీలునామా రాసి తీసుకొస్తాడు లాయర్. నా మనసులో ఏముందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. దయచేసి ఎవ్వరూ అడ్డుపడకండి అంటాడు సీతారామయ్య. లాయర్ గారు మీరు చదవండి అంటాడు సీతారామయ్య. ఇంతలో రాజ్ వచ్చి ఆ వీలునామాను చింపేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.