Karthikeya 2 Movie Review : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మెండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
కార్తికేయ 1 హిట్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ‘కార్తికేయ 1’లో నిఖిల్ హీరో గా చెయ్యడంతో ‘కార్తికేయ 2’ లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు నిఖిల్. శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. ‘కార్తికేయ 2’ లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది .అని దర్శకుడు అంటున్నారు.
కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి. యఫ్. ఎక్స్ చాలా బాగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా నైజాంలో 3.50 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. సీడెడ్: 1.8 కోట్లు, ఆంధ్రా: 6 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంగా 11.30 కోట్లకు అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కర్నాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్ : 1.00 కోట్లుగా అమ్ముడు పోయిందని తెలుస్తోంది.
దీంతో మొత్తంగా ఈ సినిమా12.80 కోట్లకు అమ్ముడు అవ్వగా.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 13.30 కోట్ల షేర్ రావాల్సి ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కార్తికేయ 2 సినిమాకు ఎలాంటి అవాంతరం రాకుండా చూసింది దేవుడైన కృష్ణుడే అని అన్నాడు నిఖిల్ . మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు జనాలు వస్తారని రీసెంట్‌గా బింబిసార, సీతారామం చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ నాకంటే ముందుండింది. కార్తీక ఘట్టమనేని అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సురేష్‌గారు ఎక్సలెంట్ సెట్స్ వేశాడు. మా సినిమాకు కాల భైరవ తన మ్యూజిక్, ఆర్ఆర్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు అని నిఖిల్ అన్నాడు.
కార్తికేయ 2 మూవీ రివ్యూ
యంగ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో కార్తికేయ ఒకటి. ఈ చిత్రం మంచి హిట్ సాధించగా, ఈ మూవీకి సీక్వెల్‌గా కార్తికేయ 2 రూపొందించారు. చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, K.S శ్రీధర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య & హర్ష చెముడు ఉన్నారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు మరియు TG విశ్వ ప్రసాద్ & అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు. నేడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఎలా ఉందో చూద్దాం..
కథ:
కార్తికేయ 2 ఊహాజనితమైన కథతో తెరకెక్కింది. శ్రీకృష్ణ భగవానుడు కాలి కంకణం చుట్టూ కథ నడుస్తుంది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన నిఖిల్ ఇంట్రెస్టింగ్ విషయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ద్వారకలో జరిగే పరిస్థితుల వెనుక రహస్యాన్ని వెతుకుతాడు మరియు అతని సత్యాన్వేషణ అతన్ని కొన్ని పురాతన నమ్మకాలకు మరియు ద్వారకలోని శ్రీకృష్ణుని శక్తికి సంబందించిన ఎన్నో విషయాలని బయటకి తీసుకువస్తుంది. కార్తికేయతో పాటు ఇంకెవరికి అది కావాలి? దాని కోసం కార్తికేయ సాగించిన సాహసోపేత ప్రయాణం ఎలా సాగింది అనేది చిత్ర కథ
నటన పరంగా, నిఖిల్ కార్తికేయ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన నటనతో మరోసారి మెప్పించాడు నిఖిల్. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలానే తన పాత్రకు తగినట్టుగా నటించింది. మరోవైపు అనుపమ్ ఖేర్ బాగానే నటించాడు. శ్రీనివాస రెడ్డి కొన్ని సీన్లలో తనదైన టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర నటీనటులంతా కథానుగుణంగా తమ పాత్రలకు న్యాయం చేశారు.
చందూ మొండేటి ఎక్కడ కూడా ప్రేక్షకులకి బోర్ ఫీలింగ్ లేకుండా చేశాడు. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కాల బైరవ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కార్తికేయ 2 లో కొన్ని మైనస్ కూడా ఉంది.కార్తికేయ రేంజ్ థ్రిల్ సీక్వెల్ లో లేదు. అలరించే చిత్రం అయినప్పటికీ భారీ ట్విస్ట్స్, గూస్ బంప్స్ కల్గించే రేంజ్ ఈ చిత్రానికి లేదు. అలాగే స్లో అండ్ ఫ్లాట్ నేరేషన్ కొంచెం నిరాశ పరిచే అంశం. బీజీఎం ఇంకొంత మెరుగ్గా ఉంటే బాగుండేది .
చివరిగా… ఓ కొత్త కథను ఆకట్టుకునే కథనంతో దర్శకుడు నడిపించాడు. హీరో నిఖిల్ అన్నీ తానై సినిమాను నడిపించగా ఆయన సాహసాలు మెప్పిస్తాయి. చెప్పుకోదగ్గ థ్రిల్స్, ట్విస్ట్స్ లేకపోవడం ప్రధాన మైనస్ కాగా, సినిమాని ఓ సారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైన నిర్మాణ విలువలకు తోడు పట్టున్న స్క్రీన్ ప్లే, కొత్త కథ సినిమాకు ప్రధాన బలంగా ఉంది. ఆద్యంతం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ దర్శకుడు కలిగించగలిగాడు . సినిమా ఆరంభంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. మూవీలోని లొకేషన్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.