
Kushi Movie Review : ఖుషీ మూవీ పబ్లిక్ టాక్.. విజయ్ కంటే సామ్ ఇరగదీసింది.. హిట్ పడ్డట్టేనా?
Kushi Movie Review : ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఖుషీ Kushi మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ vijay devarakonda, సమంత Samantha హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బెనిఫిట్ షోలే కాదు.. ఇప్పటికే మార్నింగ్, ఆఫ్టర్ నూన్ షోలు కూడా పడ్డాయి. ఇప్పటికే సినిమా రివ్యూలు కూడా వచ్చేశాయి. మరి ఖుషీ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో విజయ్ దేవరకొండ అభిమానులు, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలు చూసిన వాళ్లు ఏం చెబుతున్నారో చూద్దాం రండి.
చాలామంది ప్రేక్షకులు అయితే లైగర్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బాగుందంటూ చెప్పుకొచ్చారు. ఇక.. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని చెబుతున్నారు. సినిమా కూల్ గా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుందని చెబుతున్నారు. విజయ్ కి మళ్లీ గీత గోవిందం లాంటి క్యారెక్టర్ ఇచ్చారని చెబుతున్నారు. సమంత, విజయ్ దేవరకొండ పెయిర్ గా చేశారు. స్క్రీన్ ప్రజెన్స్ వాళ్లది చాలా బాగుంది అంటున్నారు.
చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. ఆ గొడవలను విడాకుల దాకా తీసుకెళ్లకుండా వాటిని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారు అనేదే ఈ సినిమా కథ. మరీ బాగుంది అని చెప్పలేం.. మరీ బాగలేదు అని చెప్పలేం. చూడొచ్చు. డీసెంట్ గా ఉంది మూవీ అని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. దీన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే కాకుండా ఫుల్ ఫ్యామిలీ లవ్ స్టోరీగా చూడాలని ప్రేక్షకులు చెబుతున్నారు.
Kushi Movie Review : ఖుషీ మూవీ పబ్లిక్ టాక్.. విజయ్ కంటే సామ్ ఇరగదీసింది.. హిట్ పడ్డట్టేనా?
పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ కు, ఈ సినిమా టైటిల్ ఖుషీకి అస్సలు సంబంధం లేదంటున్నారు ప్రేక్షకులు. సినిమా క్లైమాక్స్ కూడా అదుర్స్ అంటున్నారు. ఒక నాస్తికుడికి, ఆస్తికుడికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఈ సినిమాలో చూపించారని చెబుతున్నారు. ప్రెజెంట్ జనరేషన్ కి కావాల్సిన విధంగా, వాళ్లకు వచ్చే సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలో అలాగే తీశారు. అయితే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కంటే కూడా సమంత నటన ఇరగ దీసిందని చెబుతున్నారు.
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడే మనస్పర్థలు, భావోద్వేగాలనే డైరెక్టర్ శివ మూల కథగా తీసుకొని ఈ సినిమా కథను రాసుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రేమ కథ ముగిశాక పెళ్లి అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, గొడవలు జరిగితే ఎలా సరిదిద్దుకోవాలి.. అన్నింటినీ ఈ సినిమాలో మిక్స్ చేశారు.
ఇక ఈ సినిమాలో హైలెట్ పాయింట్స్ ఏంటంటే.. కామెడీతో పాటు లాస్ట్ 30 నిమిషాలు మాత్రం అదిరిపోతుందట. లాస్ట్ 30 నిమిషాల సినిమా చూసి ఏడవని ప్రేక్షకుడు ఉండడు అంటున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని పబ్లిక్ టాక్ నడుస్తోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.