Malli Modalaindi Movie Review : సినిమా పేరు : మళ్ళీ మొదలైంది .. పెళ్లి, డైవర్స్.. ఈ కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ను కొత్తగా ప్రేక్షకులకు చూపిస్తే వాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పెళ్లిని, విడాకులను సరికొత్తగా చూపించేందుకు వచ్చిన సినిమానే మళ్ళీ మొదలైంది. సుమంత్ హీరోగా నైనా గంగూలీ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ డైరెక్టర్. అయితే.. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. ఈ సినిమా జీ5 ఓటీటీలో తాజాగా విడుదలైంది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే.
ఈ సినిమాలో హీరో సుమంత్ పేరు విక్రమ్. తను ఒక చెఫ్. నిషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నిషా అంటే వర్షిణి సౌందరరాజన్. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. కొన్నేళ్లకు వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలని అనుకుంటారు. వెంటనే విడాకులు తీసుకుంటారు. విక్రమ్, నిషాకు విడాకులు ఇప్పిస్తుంది పవిత్ర. అనే మన హీరోయిన్ నైనా గంగూలీ. అయితే.. తనకు విడాకులు ఇప్పిస్తున్న సమయంలోనే పవిత్రను చూసి విక్రమ్ ప్రేమలో పడతాడు.
కాకపోతే రెండో పెళ్లి అంటే విక్రమ్ కు భయం పుడుతుంది. అందుకే రెండో పెళ్లి అని గుర్తొస్తేనే ఆగిపోతాడు. మళ్లీ పెళ్లి చేసుకొని మళ్లీ గొడవలు అయితే.. మళ్లీ విడాకులు తీసుకోవల్సి వస్తుందని టెన్షన్ పడుతుంటాడు. అతడి భయాన్ని తెలుసుకున్న పవిత్ర కూడా అతడిని దూరం పెడుతుంటుంది. మరి.. చివరకు ఏం జరుగుతుంది. పవిత్ర అతడి ప్రేమను, భయాన్ని అర్థం చేసుకుంటుందా? విక్రమ్ కు ఉన్న భయం తొలగిపోతుందా? చివరకు.. పవిత్రను రెండో పెళ్లి చేసుకుంటాడా? అనేదే ఈ సినిమా అసలు కథ.
సాధారణంగా పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అనే కథాంశంపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. పెళ్లి తర్వాత.. విడాకులు తీసుకుంటే.. విడాకుల తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమా కథ అదేవృత్తంతో తిరుగుతూ ఉంటుంది. మొదటి సారి విడాకులు తీసుకున్న తర్వాత మరోసారి విక్రమ్ పవిత్ర ప్రేమలో పడ్డా.. మధ్యలో చాలా ట్విస్టులను దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. రెండో పెళ్లి అనే కాన్సెప్ట్ ను దర్శకుడు బాగా ఎలివేట్ చేశాడు. మరోవైపు సినిమాలో కామెడీ కూడా బాగానే ఉంటుంది. వెన్నెల కిశోర్ కామెడీ సీన్లు బాగుంటాయి. సుహాసిని నటన కూడా అందరినీ మెప్పిస్తుంది.
నటీనటులు : సుమంత్, నైనా గంగూలీ, వర్షిణీ సౌందరరాజన్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, సుహాసిని తదితరులు
డైరెక్టర్ : టీజీ కీర్తి కుమార్
ప్రొడ్యూసర్ : రాజశేఖర్ రెడ్డి
రిలీజ్ ప్లాట్ ఫామ్ : జీ5 ఓటీటీ
రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 11, 2022
ప్లస్ పాయింట్స్
సినిమాకు కథే బలం. అలాగే ఈ సినిమాలో సుమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటనలో సుమంత్ చాలా పరిణతి చెందాడు. ప్రతి సీన్ లో లీనమై నటించాడు. సినిమాల్లో పెళ్లి గురించి వచ్చే డైలాగులు కూడా బాగుంటాయి.
మైనస్ పాయింట్స్
సినిమాకు కథ బలం అయినప్పటికీ.. బలమైన కథనం లేదు. అదే సినిమాకు మైనస్ పాయింట్ అయింది. సినిమా కూడా కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొడుతాయి.
కన్ క్లూజన్
మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్ గా ఉండే సీన్లు లేనప్పటికీ.. సమాజంలో నేడు జరుగుతున్న అంశాన్ని తీసుకొని డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కొత్త కథ కూడా కానప్పటికీ.. కథనం కొత్తగా ఉంటుంది. అందుకే.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింద కాబట్టి.. టైమ్ పాస్ కోసం ఏం చక్కా ఈ సినిమాను చూసేయొచ్చు. పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.