Categories: NewsReviews

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ Viswak Sen రేపు అనగా నవంబర్ 22 శుక్రవారం మెకానిక్ రాకీ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేఅయ్గా ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రజిని తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జతగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు.

సినిమా రిలీజ్ కు కొద్దిరోజుల ముందే ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా మరో రిలీజ్ ట్రైలర్ వదిలారు. ఐతే విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి సినిమాను అసలు గెస్ చేయలేరని సినిమాలో ఇదివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ఉందని అంటున్నాడు. సినిమాపై సూపర్ కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్న విశ్వక్ సినిమాలో ఆడియన్స్ అందరు కచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారని అంటున్నాడు.

నటీనటులు: విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌, సునీల్‌, నరేశ్‌, హైపర్‌ ఆది, హర్ష వర్థన్‌ తదితరులు

సంగీతం : జేక్స్‌ బిజోయ్‌

సినిమాటోగ్రఫీ : మనోజ్‌రెడ్డి కాటసాని

ఎడిటింగ్‌ : అన్వర్‌ అలీ

నిర్మాత : రామ్‌ తాళ్లూరి

రచన, దర్శకత్వం : రవితేజ ముళ్లపూడి

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review విశ్వక్ నమ్మకంగా చెబుతున్నాడు అంటే..

విశ్వక్ నమ్మకంగా చెబుతున్నాడు అంటే కచ్చితంగా సినిమాలో విషయం ఉండి ఉంటుంది. మెకానిక్ రాకీ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ గా కనిపించనున్నాడు. ఐతే సినిమాలో ఒక ట్విస్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని విశ్వక్ సేన్ చెబుతున్నాడు. మరి విశ్వక్ చెబుతున్న ఆ ట్విస్ట్ ఏంటన్నది మ‌రి కొన్ని గంట‌ల్లో థియేటర్ లో చూడాలి.

విశ్వక్ సేన్ ఈ సినిమాలో నరేష్, సునీల్ లాంటి సీనియర్ స్టార్స్ తో నటించానని.. వారితో కలిసి చేయడం మొదటిసారని అన్నారు. రవితేజ చెప్పిన కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. నిర్మాతలు కూడా తనకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీడియం రేంజ్ లో ఆడింది. సినిమాలో విశ్వక్ నటన బాగున్న ఎందుకో అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే మెకానిక్ రాకీ మాత్రం ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాం అంటున్నాడు మాస్ కా దాస్.  thetelugunews.com ను వీక్షించండి  Mechanic Rocky Movie Review and Rating In Telugu , Viswak Sen, Mechanic Rockey, Meenakshi Chaudhary, Sraddha Srinath .

యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మెకానిక్ రాకీ. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రజిని తాళ్లూరి నిర్మించారు. సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

Mechanic Rocky Movie Review కథ :

బీటెక్ మధ్యలో ఆపేసిన రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) తండ్రి రామకృష్ణ (నరేష్ వీకే) నడిపే యారేజీలో మెకానిక్ పని చేస్తుంటాడు. గ్యారేజీలో రిపేర్లు చేయడమే కాకుండా కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అలా అతని దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్ధ శ్రీనాథ్) వస్తారు. రాకీ చదువుకునే టైం లో ఇష్టపడిన అమ్మాయి ప్రియ తన ఫ్రెండ్ సిస్టర్ కూడా.. ఐతే వీళ్ల ప్రేమ మొదలు కాగానే కొన్ని పరిస్థితుల వల్ల దూరం అవుతారు. కొంతకాలం తర్వాత రాకీని కలిసిన ప్రియ గురించి రాకీ ఏం తెలుసుకున్నాడు..? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు..? వీళ్ల లైఫ్ లోకి వచ్చిన మాయ ఎవరు..? అన్నది తెలియాలంటే మెకానిక్ రాకీ తెలియాల్సిందే.

కథనం :

సినిమా మొదలవడం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మొదలైనట్టు అనిపిస్తుంది.. ట్రైలర్ చూశాక కూడా అదేలా అనిపిస్తుంది. కానీ సినిమా థ్రిల్లర్ జోనార్ లో వేళ్తుంది. కథ కథనాలు కొత్త పంథాలో వెళ్తాయి. సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చెప్పినట్టు ఇది రెగ్యులర్ సినిమాగా అనిపిస్తున్నా దీనిలో ఊహించని ట్విస్ట్ ఉందని ఊరించాడు. ఐతే క్రైం బ్యాక్ డ్రాప్ కథను లవ్ స్టోరీ చూపించే ప్రయత్నం చేశారు….

ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో నడిపించారు అన్నట్టుగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఫస్ట్ హాఫ్ లో పెద్దగా మ్యాటర్ ఏం లేదు. ఐతే సినిమాకు బలం అవ్వాల్సిన సెకండ్ హాఫ్ ఊహించిన స్థాయిలో లేదు కానీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమాలో అసలు బలం అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఐతే అది కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేంతగా మెప్పించదు.

కథ కథనాలు పాత్రల నడవడిక ఎందుకో అంత సహజంగా అనిపించలేదు. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే కథనం, ఎమోషన్ ని వర్క్ అవుట్ చేయలేకపోయారు. ఐతే ఈ సినిమా చెప్పాల్సిన విధంగా కాకుండా కమర్షియల్ హంగులు జోడించడం సినిమాకు మైనస్ గా మారింది. మిడిల్ క్లాస్ టార్గెట్ గా కొందరు చేసే మోసాలను సినిమాలో చూపించారు. ఐతే అంత ఇంపాక్ట్ గా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారు.

నటన & సాంకేతిక వర్గం :

విశ్వక్ సేన్ రాకీ పాత్రలో ఇంప్రెస్ చేశాడు. ఐతే తన క్యారెక్టరైజేషన్ అతని రెగ్యులర్ సినిమాల మాదిరిగానే ఉంది. ఏమాత్రం కొత్తగా అనిపించదు. ఐతే తనవరకు సినిమాకు కావాల్సినంత ఇచ్చాడు విశ్వక్ సేన్. మీనాక్షి చౌదరి, శ్రాద్ధ శ్రీనాథ్ లు ఆకట్టుకున్నారు. సినిమాలో వారిద్దరి ఫ్రెష్ నెస్ బాగుంది. సునీల్ తో పాటు నరేష్ కి మంచి రోల్ పడింది. హర్షవర్ధన్, రోడీస్ రఘు, హర్ష కూడా పరిధి మేరకు నటించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం ఆకట్టుకుంది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ రవితేజ ఒక మంచి ప్లాట్ ని కమర్షియల్ హంగులు జోడించడం వల్ల సినిమా ట్రాక్ తప్పినట్టు అయ్యింది. సినిమాకు టెక్నికల్ టీం బెస్ట్ ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

విశ్వక్ సేన్

సెకండ్ హాఫ్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

కామెడీ మెప్పించలేదు

స్లో నరేషన్

బాటం లైన్ : మెకానిక్ రాకీ.. సగం రిపేర్లే చేశాడు..!

రేటింగ్ : 2.5/5

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago