Home » Entertainment » Bigg Boss Telugu 8 Intense T Shirt Battle For The Final Mega Chef Contender
Entertainment

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 21, 2024, 9:02 pm
Advertisement

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు, క‌ప్ ఎవ‌రు అందుకుంటారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ చివరి మెగాచీఫ్ గా పోటీపడటానికి కంటెండర్స్ ను సెలక్ట్ చేయసుకోవడం కోసం ఓ టాస్క్ పెట్టారు. ఐదుగురుమాత్రమే… చీఫ్ కంటెండర్స్.. హౌస్ లో ఉన్నవారి కోసం షర్ట్స్ వస్తుంటాయి. ఒక్కొక్కరి షర్ట్ విడిగా గ్యాప్ తో విసిరేస్తారు. దాన్ని చింపకుండా కాపాడుకోవాలి. అలా బసర్ మోగేంత వరకూ కాపాడుకుంటే.. వారు పోటీలో నిలుస్తారు. ఇష్టంలేని వారు ఎదుటివారి ష‌ర్ట్ చింప‌చ్చు. మొదట ప్రేరణతో గేమ్ స్టార్ట్ అయ్యింది. ప్రేరణ, గౌతమ్, తేజ, అవినాష్, యష్మి, పృధ్వి, నబిల్, విష్ణు ప్రియ టీషర్ట్స్ రాగా అందులో పృధ్వి, తేజ, విష్ణు ప్రియా, యష్మి టీ షర్ట్స్ మాత్రమేకాపాడుకోగలిగారు.

Advertisement

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : ట‌ఫ్ ఫైట్..

మరీ ముఖ్యంగా పృధ్వీకి, విష్ణు ప్రియకు, తేజ కు నబిల్ సపోర్ట్ చేశాడు. యష్మికి కూడా సపోర్ట్ గానిలిచాడు. అయితే నబిల్ రేసులో లేకుండా చేయడం కోసం నిఖిల్, ప్రేరణ, రోహిణి పనికట్టుకుని టీషర్ట్ ను చించేశారు. నిఖిల్, రోహిణి టీషర్ట్స్ రాక‌పోవ‌డంతో కంటెండెర్ ను ఏంచుకునే బాధ్యత హౌస్ లో ఉన్నవారికి ఇచ్చడు బిగ్ బాస్. ఇక ఈ గేమ్ కంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు హౌస్ లో జరిగాయి. విష్ణు కు అవినాశ్ కు, విష్ణు ప్రియ, యష్మికి మధ్య గొడవ జరిగింది. కిచెన్ క్లీనింగ్ విషయంలో విష్ణును అడిగినందుకు ఆమె రకరకాల మాటలు అన్నది. టాస్క్ జరుగుతన్న టైమ్ లో కూడా కాస్త అతిగా ప్రవర్తించింది. రోహిణితో కూడా కాస్త ఘాటుగానే మాట్లాడింది విష్ణు. ఇక తేజానిద్రపోయినందుకు ఇచ్చిన పనిష్మెంట్ అందరిని నవ్వించింది.

Advertisement

12వ నారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వగానే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో మొదటి రోజున చిట్ట చివరి స్థానంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5లో ఉండే ఇంటి సభ్యురాలు యష్మీ గౌడ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఒక్కరోజులో బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయింది. దాంతో టాప్ 2 ప్లేస్‌లోకి యష్మీ దూసుకొచ్చింది. మొదటి ప్లేస్‌లో ప్రేరణ కొనసాగుతోంది. రెండో స్థానంలో య‌ష్మీ, మూడో స్థానంలో నబీల్, నిఖిల్ ఒక్కసారిగా నాలుగో స్థానంలోకి మరింతగా పడిపోయాడు. నాలుగో స్థానంలో ఉన్న పృథ్వీ ఐదో ప్లేస్‌లోకి జారిపోయాడు. అన్ అఫీషియల్ ఓట్ల ప్రకారంగానే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది దాదాపుగా అంచనా వేయొచ్చు. ఈ లెక్కన ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. Bigg Boss Telugu 8 , Bigg Boss Telugu 8 intense t shirt battle for the final mega chef contender ,  Bigg Boss Telugu , Bigg Boss 8 Telugu

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి