Mishan Impossible Movie Review : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ , రేటింగ్..!
Mishan Impossible Movie Review : తాప్సీ గురించి చెప్పాలంటే.. తను అందరు హీరోయిన్లలా కాదు. తను ఏ సినిమాలో నటించినా.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలనుకుంటుంది. రొటీన్ హీరోయిన్ ఫార్ములా కాకుండా.. కొత్తగా ట్రై చేస్తుంటుంది. తెలుగులోనే తను ఎంట్రీ ఇచ్చినా చివరకు బాలీవుడ్ లో స్థిరపడిపోయింది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా.. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో తాప్సీ నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్.
తాప్సీ పెద్ద సినిమా కన్నా… చిన్న సినిమాలనే ఎక్కువగా ఒప్పుకుంటుంది. దానికి కారణం.. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసమే. మరోవైపు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో ఉన్న పిల్లల పాత్ర ఏంటి? తాప్సీ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే.. సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Mishan Impossible Movie Review : సినిమా పేరు : మిషన్ ఇంపాజిబుల్
నటీనటులు : తాప్సీ, మాస్టర్ హర్ష్ రోషన్, మాస్టర్ భాను ప్రకాశ్, మాస్టర్ జయతీర్థ మొలుగు, హరీశ్ పరేదీ
డైరెక్టర్ : స్వరూప్ ఆర్ఎస్ జే
ప్రొడ్యూసర్ : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్
మ్యూజిక్ : మార్క్ రాబిన్
Mishan Impossible Movie Review : కథ ఏంటంటే?
ఈ సినిమాలో ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ల పేర్లు రఘుపతి(హర్ష్ రోషన్), రాఘవ(భాను ప్రకాశ్), రాజారామ్(జయతీర్థ మొలుగు), ఈ ముగ్గురు చదువుల్లో టాప్. కానీ.. ఆర్జీవీలా గొప్ప డైరెక్టర్ అవ్వాలనేది రఘుపతి కల. కేబీసీ విన్నర్ అవాలనేది రాఘవ కల. క్రికెటర్ అవ్వాలనేది రాజారామ్ కల. వీళ్ల కల నెరవేరాలంటే ఏదో ఒకటి ముందు చేయాలనుకుంటారు. దాని కోసం కరుడుగట్టిన డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవాలని అనుకుంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన శైలజ(తాప్సీ) పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే రామ్ శెట్టిని పట్టుకోవడం తెగ ప్రయత్నిస్తుంటుంది. అయితే.. ఆ ముగ్గురు పిల్లలు శైలజకు ఎలా పరిచయం అవుతారు. రామ్ శెట్టిని పట్టుకోవడంలో శైలజకు ఎలా సాయం చేస్తారు అనేదే మిగితా కథ.
Mishan Impossible Movie Review : ఎవరు ఎలా చేశారు?
ముగ్గురు పిల్లలు అయితే చింపేశారు. నటనను అదరగొట్టారు. తాప్సీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కాకపోతే కొన్ని చోట లాజిక్స్ మిస్ అవుతాయి. తనది చాలా లిమిటెడ్ రోల్.
మిగితా నటులు రిషబ్ శెట్టి, సుహాస్, సందీప్ రాజ్, సత్యం రాజేశ్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్
ముగ్గురు పిల్లల నటన
మైనస్ పాయింట్స్
వీక్ స్టోరీ
లాజిక్ లేని సీన్లు
బోరింగ్ సీన్లు
కన్ క్లూజన్
మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. ప్రస్తుతం థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా తప్పించి వేరే సినిమాలు లేవు. ఏజెంట్ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. ఆ అంచనాలను డైరెక్టర్ అందుకోలేకపోయాడు. కానీ.. టైమ్ పాస్ కోసం పిల్లల సూపర్బ్ యాక్షన్ కోసం ఒక్కసారి సినిమాను చూడొచ్చు.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 2.25/5