Categories: NewsReviews

My Baby Movie Review : మై బేబి మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు లో అనువాదమై సూపర్ హిట్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ సైతం తెలుగు సినిమాలకన్నా మలయాళ , తమిళ్ చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘DNA’ చిత్రం ఈరోజు తెలుగు లో ‘మై బేబి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అథర్వ మ‌ల‌యాళం న‌టి నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి మై బేబీ అంటూ రావ‌డంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. మరి ఈ మూవీ కథ ఏంటి..? సినిమా హైలైట్స్ ఏంటి అనేది రివ్యూ లో చూద్దాం.

My Baby Movie Review : మై బేబి మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

My Baby Movie Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోరుకునే వారికీ మై బేబీ బెస్ట్ మూవీ

ఈ చిత్రం ఆనంద్ అనే యువకుడి (అథర్వ) చుట్టూ తిరుగుతుంది. ప్రేమ విఫలమైన తర్వాత మద్యానికి అలవాటైన ఆనంద్, అనుకోకుండా బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న దివ్య (నిమిషా)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రేమతో ఆమెను అర్థం చేసుకుని, సంతోషంగా జీవిస్తున్న ఈ జంటకు బాబు పుడతాడు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఆసుపత్రిలో తమ బిడ్డను మార్చేశారని దివ్య పదేపదే చెబుతుంది. ఆమె మానసిక స్థితి కారణంగా ఎవరు నమ్మకపోయినా, ఆనంద్ మాత్రం భార్యపై నమ్మకంతో అసలు నిజాన్ని వెతకడం ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంతో సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ముందుకు సాగుతుంది. మరి నిజముగా బాబు చేంజ్ అయ్యాడా..? లేదా ..? అసలు ఏంజరిగిందనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.

నటుల విషయానికి వస్తే.. అథర్వ తన పాత్రలో జీవించాడు. ఓ భర్తగా, తండ్రిగా, న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అతడి నటన అద్భుతంగా ఉంది. నిమిషా సజయన్ మాత్రం తన పాత్రలో తనంతట తానుగా ఒదిగిపోయింది. మానసిక సమస్యలతో బాధపడే యువతిగా ఆమె నటన భావోద్వేగాలను పునర్నిర్మించింది. బాలాజీ శక్తివేల్ కానిస్టేబుల్ పాత్రలో, కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించగా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ పాత్ర చిన్నదైనా, బలంగా నిలిచింది. ఈ మూడు ప్రధాన పాత్రలే సినిమాను ముందుకు తీసుకెళ్లాయి.

టెక్నికల్ విభాగాల్లోనూ ఈ సినిమా బలంగా నిలిచింది. జీబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే టెంపుల్ ఎపిసోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను తట్టుకుపోయేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శ్రద్ధగా ఉన్నాయనే విషయం ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. నిర్మాతలు ఖర్చు చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మొత్తంగా చెప్పాలంటే, ‘మై బేబి DNA’ అనే ఈ చిత్రం, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమాకు ప్రధాన బలాలు.

Recent Posts

Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..!

Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్…

48 minutes ago

Sania Mirza : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మ్యారేజ్ మేట‌ర్..?

Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…

2 hours ago

Love Marriage : బైక్‌పై పారిపోతున్న జంట‌.. ప‌ట్టుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ప్రేమ జంటకు పెళ్లి.. వీడియో వైర‌ల్‌..!

Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…

4 hours ago

PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..?

PM Kisan  : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…

5 hours ago

Kothapallilo Okappudu Movie Review : కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…

6 hours ago

Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…

7 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!

Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…

8 hours ago

Kaala Sarpa Dosham : మీకు కాల సర్ప దోషం ఉందా… అయితే, శ్రావణ మాసంలో శివునికి ఈ జంట సర్పాలను అర్పించండి…?

Kaala Sarpa Dosham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొందరికి కాలసర్ప దోషంతో ఉంటుంది. వీరు ఎంతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ…

9 hours ago