Pedakapu 1 Review : పెద కాపు 1 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pedakapu 1 Review : పెద కాపు 1 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Pedakapu 1 Review : పెద కాపు అనేది సినిమా పేరే కానీ.. దాని అర్థం ఏంటో తెలుసా? పెద కాపు అంటే ఒక కమ్యూనిటీ పేరు. నిజానికి పెద కాపు అనేది గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే సామాజిక వర్గం. గోదావరి జిల్లాలకు చెందిన పెదకాపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా పెదకాపు పేరుతో ఉన్న షాపులే దర్శనమిస్తాయి. ఇప్పుడు అదే పేరుతో సినిమా […]

 Authored By gatla | The Telugu News | Updated on :29 September 2023,10:16 am

Pedakapu 1 Review : పెద కాపు అనేది సినిమా పేరే కానీ.. దాని అర్థం ఏంటో తెలుసా? పెద కాపు అంటే ఒక కమ్యూనిటీ పేరు. నిజానికి పెద కాపు అనేది గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే సామాజిక వర్గం. గోదావరి జిల్లాలకు చెందిన పెదకాపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా పెదకాపు పేరుతో ఉన్న షాపులే దర్శనమిస్తాయి. ఇప్పుడు అదే పేరుతో సినిమా కూడా వచ్చేసింది. ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీకాంత్ అడ్డాల గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే కావడం.. కాపు బిడ్డ కూడా కావడంతో ఆయనకు కూడా ఈ సినిమా బీభత్సంగా కనెక్ట్ అయిందని చెప్పుకోవాలి. కానీ.. అసలు ఇది పెదకాపు అనే కులానికి సంబంధించిన సినిమా కాదు. పేరు అలా ఉన్నా కూడా ఒక వ్యక్తిని కాపలా కాసే సాధారణ వ్యక్తి కథ ఇది.

శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక కొత్త బంగారు లోకం సినిమా, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఒక ముకుంద.. ఇలా చాలా సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. బ్రహ్మోత్సవం లాంటి ప్లాఫ్ సినిమా ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇటీవల నారప్పతో మళ్లీ లైన్ లోకి వచ్చాడు శ్రీకాంత్. తాజాగా పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈసారి శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. పాత హీరోలను పక్కన పెట్టి విరాట్ కర్ణ అనే కొత్త యువకుడిని తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే.. ఈ సినిమాలో విలన్ గానూ నటించాడు శ్రీకాంత్ అడ్డాల. మరి ఈ యాక్షన్, డ్రామా ఎలా ఉందో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

pedakapu 1 movie review and rating

#image_title

Pedakapu 1 Review : సినిమా కథ ఇదే

నిజానికి ఈ సినిమా కథ ఇప్పటిది కాదు. 1980 తరం నాటిది. అప్పట్లో ఒక సామాన్యుడి కథ. పలు సవాళ్లకు ఒక సాధారణ వ్యక్తి ఎదుర్కొని ఎలా పోరాడాడు.. ఎలా బలవంతుడిగా మారాడు.. ఎలా ఎదిగాడు అన్నదే పెదకాపు 1 కథ. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు అలాంటి వాళ్లకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో నిజంగా కొందరు వ్యక్తులకు ఎదురైన సవాళ్లకు కొంత కథ జోడించారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే ఇది నిజమైన కథ అనే చెప్పుకోవాలి. ఈ కథ పెద్దది కావడంతో రెండు పార్టులుగా రానుంది.

Pedakapu 1 Review : సినిమా పేరు : పెద కాపు 1

నటీనటులు : విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేశ్, నాగబాబు, అనసూయ, ఈశ్వరి రావు

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

నిర్మాత : మిరియాల రవీందర్ రెడ్డి

బ్యానర్ : ద్వారక క్రియేషన్స్

నిడివి : 2 గంటల 29 నిమిషాలు

విడుదల తేదీ : 29 సెప్టెంబర్ 2023

Pedakapu 1 Review : విశ్లేషణ

శ్రీకాంత్ అడ్డాల మూవీ అంటేనే ఆ కథ కొంచెం కొత్తగా, మనకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కొత్త బంగారులోకం సినిమాను కొత్త హీరోతో తీశారు. ముకుందను కూడా కొత్త హీరోతో తీశారు. అలాగే.. ఇప్పుడు పెదకాపు 1 సినిమా కూడా కొత్త హీరో కావడంతో తనకు కావాల్సినంత ఫ్రీడమ్ దొరికేసింది. అందుకే సినిమాను తనకు నచ్చినట్టుగా తీశారు. హీరోగా నటించిన విరాట్ కర్ణ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అలాగే.. విలన్ గా శ్రీకాంత్ అడ్డాల ఇరగదీశారు. ఇక.. కీలక పాత్రల్లో నటించిన రావు రమేశ్, నాగబాబు, అనసూయ వీళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

డైలాగ్స్

విజువల్స్

క్యారెక్టర్స్

టెక్నికల్ వాల్యూస్

బీజీఎమ్

మైనస్ పాయింట్స్

నో ఎమోషన్స్

స్టోరీ

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.50/5

Also read

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది