Radhe Shyam First Review: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా పలు వాయిదాల తర్వాత మార్చి 11న విడుదలకి సిద్ధమైంది. సినిమా ఎలా ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సంధు. శుక్రవారం రాత్రి ఈ మూవీని తాను చూసినట్లు అతను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ మూవీలో ప్రభాస్ మామూలుగా లేడంటూ ఆకాశానికెత్తాడు. క్లాసీ, స్టైలిష్, థ్రిల్లింగ్, రొమాంటిక్ మూవీ.. ప్రభాస్‌కు తిరుగులేదు అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ ఉమేర్ రాయడం విశేషం. ప్రభాస్, పూజా హెగ్డే కెమెస్ట్రీ కూడా అదుర్స్ అని చెప్పాడు. ఈ మూవీ స్టోరీ యూనిక్ అని అన్నాడు.
మూవీ పూర్తయిన తర్వాత మరో రెండు ట్వీట్లు చేశాడు. ఇండియాలో ప్రభాస్ క్లాస్, స్టైల్‌ను బీట్ చేసేవాళ్లే లేరంటూ యంగ్ రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తాడు. అతని డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతమన్నాడు. 1970ల్లో యూరప్‌లో జరిగిన లవ్ స్టోరీగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. రాధే శ్యామ్‌ను ఇటలీ, జార్జియాలాంటి దేశాల్లో చిత్రీకరించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ఓ కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ విజువల్స్ అబ్బురపరుస్తాయన్న అభిప్రాయం వెల్లడించారు. ఇక మెయిన్ లీడ్ ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుంది అన్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే మిస్టరీ, ట్విస్ట్ అలరిస్తుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందన్నారు.
ప్రభాస్ స్టైల్ ఇండియాలో మరో హీరో బీట్ చేయలేదన్న ఆయన.. సినిమాలో చాలా సెక్సీగా ఉన్నాడని పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తంగా రాధే శ్యామ్ మూవీ తనకు ఎంతగానో నచ్చేసిందని ఉమర్ సందు సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఉమర్ సందు ఇలాంటి పాజిటివ్ రివ్యూలు ఇస్తాడు. ఆయన టాప్ రేటింగ్ ఇచ్చిన చిత్రాలు కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. కాబట్టి నీ రివ్యూ నమ్మం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.