Ranga Ranga Vaibhavanga Movie Review : ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమా చేయగా, ఇందులో కేతిక శర్మ కథానాయికగా నటించింది. పక్కా కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టయిన్ మెంట్, లవ్, రొమాన్స్… ఇలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయిన్ మెంట్ తో పాటు కావాల్సిన మేర ఎమోషన్స్ ను కూడా పండించినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కు బీజం వేసే టీజింగ్ దృశ్యాలు, కథలో అంతర్లీనంగా నడిచే కామెడీ, పాటలు, ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ పలికే డైలాగ్స్… ఇలా సినిమాను అన్ని ఎలిమెంట్స్ తో ప్యాక్ చేశారు. రిషి, రాధల పాత్రల చుట్టూ అల్లుకున్న అందమైన కథతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ అవుతుందనడంలో సందేహంలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ వచ్చింది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
అంతేకాదు ఈ సినిమా నిడివి విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. రంగరంగ వైభవంగా రెండు గంటల 23 నిమిషాలు ఉండనుంది. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇవి పోస్ట్-థియేట్రికల్ ఓటీటీ హక్కులు. సినిమా థియేటర్‌లో విడుదలైన ఐదు వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. తెలుసా తెలుసా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా.. శంకర్ మహాదేవన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుంది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.
రిలీజ్ డేట్: 2022 సెప్టెంబర్ 2
నటినటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, సుబ్బరాజు, ఆలీ, ఫిష్ వెంకట్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు.
డైరెక్టర్: గిరీశాయ
నిర్మాతలు: బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రంగ రంగ వైభవంగా అనే సినిమా చేశాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.బి బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎలా మెచ్చుతుందో చూద్దాం.
కథ: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఇద్దరు డాక్టర్లు గా కనిపిస్తారు. ఇందులో కేతిక శర్మ రాధ, వైష్ణవ్ తేజ్ రిషి పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత రిషి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. ఇక ఆయన పడిన ఇబ్బందిలేంటి.. ఇంతకీ చిన్నప్పుడు రాధ తో ఏం గొడవ జరిగింది.. పెద్దయ్యాక కలిసారా, లేదా అనే విషయాలు సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ
కామెడీ
దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
సెకండాఫ్
లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటన, రొమాన్స్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా కథా కథనాలు సినిమాను దెబ్బతీశాయి. అవుట్ డేటెడ్ ఎమోషనల్ క్లైమాక్స్ మరొక మైనస్ గా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగ రంగ వైభవంగా వైష్ణవ్ కి విజయం కట్టబెట్టడం కష్టంలానే కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. శ్యామ్ దత్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా సాంకేతిక విభాగాలు తమ పనులల్లో పూర్తి న్యాయం చేశారు.
చివరి మాట: ట్రైలర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కల్పించారు. ఫస్ట్ హాఫ్ ఒకింత ఎంటర్టైనింగ్ గా నడిపిన దర్శకుడు గిరీశాయ సెకండ్ హాఫ్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. కథలో కూడా కొత్తదనం లేదు. ఈ తరహా కథలు 20 ఏళ్ల క్రితం సక్సెస్ ఫార్ములాగా ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో సిద్ధం చేశారు. ఈ సినిమాతో వైష్ణవ్ మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.
రేటింగ్: 2/5
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.