Mr Bachchan Movie Review : మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన కంటెంట్ అంతా కూడా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా విషయంలో మాస్ రాజా ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. సినిమా తప్పకుండా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేలా ఉందని నమ్ముతున్నారు.హరీష్ శనక్ర్ తో రవితేజ షాక్, మిరపకాయ్ సినిమా చేశాడు. షాక్ సినిమా ఫలితం నిరాశ పరచినా మిరపకాయ్ మాత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు మిస్టర్ బచ్చన్ సినిమా తో వస్తున్నారు. ఐతే ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ సినిమ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కించారు హరీష్ శంకర్. ఐతే రైడ్ సినిమా కథ మాత్రమే తీసుకున్నామని సినిమా నరేషన్ పూర్తిగా వేరేలా ఉంటుందని అంటున్నారు.
రవితేజ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ హరీష్ శంకర్ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. మాస్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు బీభత్సమైన బజ్ కూడా ఉంది. తప్పకుండా సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందని చెబుతున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా లో రవితేజ లుక్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ భాగ్య శ్రీ అందాలు కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చేలా చేశాయి.ఈమధ్య రవితేజ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోళ్తా కొట్టాయి. ఈ ఇయర్ లోనే ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈగల్ నిరాశ పరచింది. ఐతే మిస్టర్ బచ్చన్ ఒక మంచి కథతో దానికి మంచి మాస్ మసాలా అంశాలతో వస్తుంది. అందుకే ఈ సినిమాపై రవితేజ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మంచి పాజిటివ్ బజ్ ఏర్పరచింది. ఇక సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ధమాకా తర్వాత రవితేజ సెన్సేషనల్ హిట్ గా మరో 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది.ఐతే ఆల్రెడీ చూసిన సినిమానే కదా అంటే అక్కడ ఉంది హరీష్ శంకర్ కాబట్టి కేవలం కథ మాత్రమే తీసుకుని రీమేక్ స్పెషలిస్ట్ గా తన మార్క్ చాటి చెప్పేలా సినిమా తీస్తాడు. అందుకే ఈ సినిమాతో తన మీద ఉన్న రీమేక్ డైరెక్టర్ ముద్రని చెరిపేయాలని చూస్తున్నాడు హరీష్ శంకర్. సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుండగా మిస్టర్ బచ్చన్ నిజంగానే అంచనాలను అందుకుందా.. సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింద.. రిజల్ట్ ఏంటన్నది తెలియాలంటే..
మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన కంటెంట్ అంతా కూడా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా బజ్ విషయంలో మాస్ రాజా ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. సినిమా తప్పకుండా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేలా ఉందని నమ్ముతున్నారు.మరి అది నిజమైందా మాస్ కమర్షియల్ మూవీగా వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుందా లేదా ఈ రివ్యూలో చొద్దాం.
సినిమా పిచ్చోడైన తనికెళ్ల భరణి షోలే సినిమాను వందసార్లు చూస్తాడు. ఆ ఇష్టంతోనే ఆనంద్ (రవితేజ)గా ఉన్న పేరుని కాస్త బచ్చన్ గా మారుస్తాడు. అప్పటి నుంచి అతని పేరు బచ్చన్ గా ముద్ర పడుతుంది. బచ్చన్ కి కూడా చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు పాటలు అంటే ఇష్టం. అతను పాటలు కూడా పాడుతాడు. తన ఊరిలోనే ఆర్కెస్ట్రాని నడిపిస్తాడు. కుమార్ సాను పాటలతో అతని స్పెషాలిటీ చూపిస్తాడు. బచ్చన్ పెద్దవాడై ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అవుతాడు. నిజాయితీ పరుడైన బచన్ అదే నిజాయితీ వల్ల సస్పెండ్ అవుతాడు చేసేదేం లేక మళ్లీ తన ఊరికి వచ్చి బ్యాండ్ ని కొనసాగిస్తున్న అతనికి జిక్కీ కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. ఐతే పెళ్లి పీఠల దాకా వచ్చే టైం కి బచ్చన్ కి మళ్లీ ఆఫీసర్స్ కాల్ చేసి ఒక ఆపరేషన్ అప్పగిస్తారు. ముత్తం జగ్గయ (జగపతి బాబు) ఇంటి పై ఐటీ రైడ్ చేయాలని ఆదేశిస్తారు. పవర్ ఫుల్ ఎంపీ అయిన జగ్గయ్య ఇంటి మీద అంతకుముందు రైడ్స్ చేసిన వారంతా మళ్లీ కనిపించలేదు. అలాంటి జగ్గయ్య ఇంటి మీద బచ్చన్ ఎలా రైడ్ చేశాడు..? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి..? జిక్కీతో బచ్చన్ పెళ్లి అయ్యిందా లేదా అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
హరీష్ శంకర్ తో రవితేజ షాక్, మిరపకాయ్ సినిమా చేశాడు. షాక్ సినిమా ఫలితం నిరాశ పరచినా మిరపకాయ్ మాత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు మిస్టర్ బచ్చన్ సినిమా తో వచ్చారు. ఐతే ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ సినిమ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కించారు హరీష్ శంకర్. ఐతే రైడ్ సినిమా కథ మాత్రమే తీసుకున్నామని సినిమా నరేషన్ పూర్తిగా వేరేలా ట్రై చేశారు. రైడ్ సినిమా మొత్తం చాలా సీరియస్ టోన్ లో నడుస్తుంది. దాన్ని హరీష్ శంకర్ ఒక మాస్ ఎంటర్టైనర్ గా మార్చేశారు.
రవితేజ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ వింటేజ్ రవితేజని గుర్తు చేశాడు హరీష్ శంకర్. మాస్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి కానీ సినిమా ఆడియన్ కి ఆసక్తి కలిగించడంలో విఫలమైంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య కామెడీ, రవితేజ ఎనర్జీ, భాగ్య శ్రీ అందాలతో నడిపించాడు. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా విరుద్ధంగా సీరియస్ గా సినిమాను తీసుకెళ్లాడు.
అక్కడే సినిమా ట్రాక్ తప్పినట్టు తెలిసిపోతుంది. హరీష్ శంకర్ కూడా కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోనే మిస్టర్ బచ్చన్ తీశాడు. సినిమాకు ఇంత హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన మేకర్స్ అందుకు కావాల్సిన స్టఫ్ మాత్రం అందించడంలో విఫలమయ్యారు. స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ క్యామియో మెప్పిస్తుంది. ఒక సాంగ్ లో డీ ఎస్ పీ కూడా తళుక్కున మెరుస్తాడు. ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యే అంశాలే కానీ అసలైన కథ కథనం వర్క్ అవుట్ కాకపోవడం వల్ల ఏదో అలా ఉన్నాయనిపిస్తుంది.
కేవలం రవితేజ వింటేజ్ ఎనర్జీ, భాగ్య శ్రీ అందాలు, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కోసం సినిమా ఒకసారి చూసేయొచ్చు. సినిమాలో గురూజీ అంటూ ఒక క్యారెక్టర్ ని పెట్టి ఒకరిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి గురూజీకి ఆయనకు ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో కానీ ఒక క్యారెక్టర్ ని పెట్టి మరీ ఇలా ఎందుకు చేశాడో తెలియాల్సి ఉంది. సినిమా అంతా అలా నడిచిపోతుంది కానీ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయ్యేలా ఉండదు. రవితేజ ఎనర్జీని సరిగా వాడకుండా ఒక రీమేక్ సినిమాను కిచిడి చేసిన ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. ఐతే మాస్ రాజా ఫ్యాన్స్ ఇంకా భాగ్య శ్రీ అందాలు చూడాలనుకునే వారు ఒకసారి ట్రై చేయొచ్చు.
నటీనటులు :
మాస్ మహరాజ్ రవితేజ మరోసారి తన ఎనర్జీని చూపించారు. సినిమా లో వింటేజ్ రవితేజాని చూసేయొచ్చు. భాగ్య శ్రీ గ్లామర్ షో మెప్పించింది. తప్పకుండా ఈ హీరోయిన్ కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక జగపతి బాబు ఎప్పటిలానే విలనిజం తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కానీ అదేమంత కొత్తగా అనిపించదు. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ, మిగతా పాత్రధారులంతా కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. బిజిఎం కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హరీష్ శంకర్ రీమేక్ ని తన మార్క్ చేంజెస్ చేశాడు కానీ అది ఆడియన్స్ ని మెప్పించేలా లేవు. పీపుల్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత ఇచ్చేశారు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ ఎనర్జీ
భాగ్య శ్రీ బోర్స్ అందాలు
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
రెగ్యులర్ మాస్
బాటం లైన్ :
మిస్టర్ బచ్చన్ టార్గెట్ మిస్ అయ్యాడు..!
రేటింగ్ : 2/5
Sobhita Dhulipala : అక్కినేని నాగ చైతన్య naga chaitanya ఈమధ్యనే హీరోయిన్ శోభిత దూళిపాళని Sobhita Dhulipala పెళ్లాడిన…
Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య, అఖిల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే నాగ…
Karthika Deepam Vantalakka : కార్తీక దీపం సీరియల్ ఫాలో Karthika Deepam అయ్యే వారికి వంటలక్క గురించి ప్రత్యేకంగా…
RTC Free Bus Scheme : Telangana తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt కొలువుదీరాక మహిళలకి ఫ్రీ బస్…
Taxpayers : పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలా అని అనేక ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే వచ్చే…
Anil Ravipudi Father : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో Sankranthiki…
Women : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్నిabhaya hastam scheme అమలు చేసేందుకు రెడీ…
Betel Leaves Benefits : తమలపాకు ని ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వస్తున్నారు. దీని ఇంటి అలంకరణ…
This website uses cookies.