Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: February 23, 2026, 9:23 pm
  •  Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun Sarja Seetha Payanam, కన్నడ స్టార్ ఉపేంద్ర కుటుంబం నుంచి పరిచయం అవుతున్న నిరంజన్ హీరోగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ‘సీతా పయనం’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా కీలక పాత్రలో కూడా అర్జున్ సర్జా కనిపించనుండటం విశేషం. కన్నడ హీరో ధ్రువ సర్జా స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాటలను సాయి మాధవ్ బుర్రా అందించగా, సంగీతాన్ని అనూప్ రూబెన్స్ సమకూర్చారు. సినిమాటోగ్రఫీ జీ బాల మురుగన్, ఎడిటింగ్ బాధ్యతలను అయూబ్ ఖాన్ నిర్వర్తించారు.

Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Seetha Payanam Movie Review కథ విషయానికి వస్తే..

కథ విషయానికి వస్తే.. చెఫ్‌గా కెరీర్‌ను ఎంచుకున్న సీత ఒక ప్రమాదానికి గురవుతుంది. ఆ ప్రమాదం తర్వాత తనను కాపాడిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణంలో అభిషేక్‌తో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే నిజాలు, ప్రేమ–నిజాయితీ మధ్య ఆమె తీసుకునే నిర్ణయమే ఈ చిత్రంలోని ప్రధాన భావోద్వేగం. తండ్రి పాత్రలో సత్యరాజ్ చూపించే మానసిక సంఘర్షణ కథకు బలంగా నిలుస్తుందని ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సమీక్షించగా, ఎలాంటి కట్స్ లేకుండా U (క్లీన్) సర్టిఫికెట్ మంజూరు చేసింది. కుటుంబ బంధాలు, స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాల సమతౌల్యాన్ని చక్కగా చూపించారని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

అర్జున్ సర్జా వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రేరణతో ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు సమాచారం. మొత్తం 2 గంటల 32 నిమిషాల రన్‌టైమ్‌తో ఫిక్స్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు కలగలిసిన ఈ ‘సీతా పయనం’ థియేటర్లలో ప్రేక్షకులకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

క‌థ‌:

తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్యరాజ్)ంటే సీత (ఐశ్వర్య అర్జున్)కు ప్రాణం. చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రే ఆమెకు ప్రపంచమవుతాడు. అటు రాజేంద్ర ప్రసాద్‌కూ కూతురంటే అపారమైన ప్రేమ. అయితే సీత పెళ్లి వయసుకు చేరుకోవడంతో ఆమెను మంచి ఇంటికి పంపాలనే ఆలోచనతో తండ్రి వరుసగా సంబంధాలు చూసుకుంటూ ఉంటాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అనే మాట వినగానే వెనుకడుగు. కారణం తండ్రిని వదిలి వెళ్లాల్సి వస్తుందనే భయం. అందుకే పెళ్లి విషయాన్ని ప్రతి సారి ఏదో ఒక కారణంతో తప్పించుకుంటూ వస్తుంది.

ఇలాంటి సమయంలో వర్క్‌షాప్ నిమిత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే సందర్భంలో అభి (నిరంజన్)ను కలుస్తుంది సీత. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రేమగా మారుతుంది. అభి ద్వారా మనుషుల విలువలు, జీవితంలోని భావోద్వేగాల్ని కొత్త కోణంలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణంలో సీత ఎదుర్కొన్న అనుభవాలు, అభి ఆమె జీవితంలో తీసుకొచ్చిన మార్పులు, ప్రేమ కారణంగా ఆమె జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే కథలో ప్రధాన అంశం. తండ్రి–కూతురు అనుబంధం, ప్రేమ, వ్యక్తిత్వ వికాసం కలిసిన భావోద్వేగ ప్రయాణంగా ఈ కథ ముందుకు సాగుతుంది.

విశ్లేష‌ణ‌:

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన తరహా సన్నివేశాలు సీతాప‌య‌నంలో ఉన్నప్పటికీ, దర్శకుడు అర్జున్ సర్జా టేకింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీత అనే పాత్రను ఎంతో పవిత్రంగా, సీతమ్మ తల్లి లక్షణాలతో తీర్చిదిద్దుతూ తన కూతురికి మర్చిపోలేని బహుమతిని అందించినట్టుగా సినిమా రూపుదిద్దుకుంది. సీత పాత్ర గుణగణాలు హైందవ ధర్మానికి ప్రతీకలా కనిపిస్తాయి. ప్రతి మనిషికి ఎదుటివారి విలువ తెలియజేసే విధంగా కథను ఆవిష్కరించడం ఈ చిత్రానికి ప్రధాన బలం. ముఖ్యంగా గో రక్షణపై రూపొందించిన ఎపిసోడ్ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించేలా ఉండటంతో థియేటర్లలో చప్పట్లు వినిపించాయి.

మనిషి జీవితంలో సమయ విలువ, బంధాలు, ప్రేమ, జీవన విధానం గురించి చెప్పిన డైలాగులు సినిమా పాజిటివ్ పాయింట్లుగా నిలిచాయి. మూగజీవాల పట్ల హింస తగదనే సందేశాన్ని ఒక సన్నివేశంలో హృద్యంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని కొత్త కోణంలో చూపించిన కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. అశ్లీలతకు ఎక్కడా తావు లేకుండా ఎమోషన్స్‌తో కథను నడిపించడం దర్శకుడి నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఫస్టాఫ్‌లో సీత–అభి ప్రయాణం సరదాగా సాగితే, సెకండాఫ్‌లో భావోద్వేగాలు ప్రధానంగా నిలుస్తాయి. క్లైమాక్స్ ఈ చిత్రానికి అసలైన బలం. మధ్య మధ్యలో కొద్దిపాటి సాగదీత ఉన్నా, మొత్తంగా ఇది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తూ మంచి సందేశాన్ని అందిస్తుంది.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp