Singham Again Movie Review : బాలీవుడ్‌లో Bollywood ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింగమ్ అగైన్ . ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు Ajay Devgn అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, రోహిత్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరించారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో ఐదో సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 1వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.
ఇండియన్ సినిమా రంగంలో ఇటీవల కాలంలో ఇంతలా భారీ తారాగణం, సూపర్ స్టార్స్ కలయికలో మూవీ వచ్చిన దాఖలాలు లేవు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీని సుమారుగా 375 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సింగమ్ అగైన్ మూవీ గతంలో పోలీస్ అధికారి పాత్రల్లో నటించిన వారందరూ ఈ సినిమాలో నటించారు. దబాంగ్ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో రెండు నిమిషాల పాటు అభిమానులకు కనువిందు చేసారు. అజయ్, అక్షయ్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి సల్మాన్ నడిచి వస్తుండడం అందరిని ఆకట్టుకుంది.
ఇందులో నటీనటుల పర్‌ఫార్మెన్స్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. అజయ్ దేవగణ్ చిత్రం అని నమ్మడం కష్టమే. మొదటి సగం అర్జున్ కపూర్ షో, అజయ్‌తో సహా మిగతా వారందరూ అండర్ పెర్ఫార్మింగ్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ జస్ట్ అమేజింగ్ – అజయ్ సర్ ఎంట్రీ మాములుగా లేదని అన్నారు. చుల్బుల్ పాండే పాత్రలో సల్మాన్ అతిధి పాత్ర చాలా ఆకట్టుకుంది అని మరో నెటిజన్ అన్నారు. సింగమ్ అగైన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. నేషనల్ చైన్ మల్టీప్లెక్స్‌లో బుకింగ్ ఓపెన్ కాగానే సుమారుగా 65 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
Fingers : చాలా మంది చేతి వేళ్లను అప్పుడప్పుడు ఇరుస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఇలా చేతి వేళ్లను…
Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య…
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
This website uses cookies.