vakeel saab Movie review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో థియేటర్స్ లోకి అడుగు పెట్టాడు. గత నెల రోజులుగా ప్రమోషన్స్ తో హోరెత్తించిన వకీల్ సాబ్ చిత్ర బృందం సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని చాలా నమ్మకంగా చెబుతూ వచ్చారు. ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం..ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ పింక్ గా..కోలీవుడ్ లో అజిత్ నటించిన నేర్కొండ పార్వైగా 100 కోట్ల క్లబ్ లో చేరిన కథ తెలుగులో వకీల్ సాబ్ గా వచ్చింది. మరి వకీల్ సాబ్ ఎంతవరకు మెప్పించాడు చూద్దాం రండు..
వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలంటే అంజలి, నివేత థామస్, అనన్య పాండేలది. ఈ ముగ్గురు ఎంపీ కొడుకు అండ్ బ్యాచ్ ని కొట్టి పారిపోవడంతో సినిమా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీ తన పలుకుబడితో కొడుకుని కొట్టినందుకు కేసు పెట్టి ముగ్గురమ్మాయిలలో ఒకరైన నివేతా థామస్ ని జైల్లో పెడతారు. అదే కాలనీలోకి వచ్చిన కె. సత్యదేవ్ ( పవర్ స్టార్ పవన్ కళ్యాణ్), అంజలి వాళ్ళ కేసు ఎఫ్.ఐ.ఆర్ చూసి వాళ్ళకి కొన్ని సూచనలు.. సలహాలు ఇచ్చి సహాయపడతాడు. దీంతో ఎంపీ సత్యదేవ్ కి వార్నింగ్ ఇవ్వాలనుకుంటారు. ఇది ఛాలెంజింగ్ గా తీసుకున్న సత్యదేవ్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఇక కోర్టులో నంద(ప్రకాష్ రాజ్)తో పోటా పోటీగా వాదించి తన క్లైంట్ నివేతా ని కేసు నుంచి ఎలా బయట పడేశాడు? అసలు ఏయే కేసుల్లో నివేతా, అంజలి, అనన్యలను ఇరికించారు? సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తన న్యాయవాది వృత్తిని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది..? ఏ సంబంధం లేని ఈ ముగ్గురు అమ్మాయిల కోసం ఎందుకు ఇంతగా పోరాటం చేశాడన్నదే అసలు కథ.
సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ మ్యానియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మీదే మొత్తం ఫోకస్ ఉంది కాబట్టి అన్నీ రకాలుగా ఫస్ట్ హైలెట్ అయింది పవన్ కళ్యాణే. ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ సాబ్ గా చాలా హుందాగా నటించాడు. ఎమోషన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూడవచ్చు. ముఖ్యంగా కోర్ట్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. పాత్ర తాలూకూ స్వభావ్వాన్ని పక్కాగా చూపిస్తూనే తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్ తర్వాత పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్రలు నివేతా, అంజలి, అనన్యలది. ఈ ముగ్గురు చాలా బాగా నటించారు. ఇక ప్రకాష్ రాజ్ గురించి చెప్పేదేముంది. ఇలాంటివి ఆయనకి కొట్టిన పిండి. మొత్తం గా చూస్తే పవర్ స్టార్ తర్వాత బాగా హైలెట్ అవుతుది నివేతా, అంజలి.
ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఖచ్చితంగా ముందు చెప్పుకోవాల్సిన దర్శకుడు వేణు శ్రీరాం ది. వేణు కెరీర్ లో మొదటి సారి పెద్ద స్టార్ తో సినిమా.. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో.. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా..బాలీవుడ్, కోలీవుడ్ లో హిట్ అయిన సినిమా. ఇన్ని ఒత్తిడిలను అధిగమించి పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఈ మూడేళ్ళ నుంచి ఉన్న ఆకలి తీరుతుందే అదే చేశాడు. దర్శకుడిగా కాకుండా పవన్ అభిమానిగా వేణు శ్రీరాం వకీల్ సాబ్ ని సిద్దం చేశాడని క్లియర్ గా తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కి ఏ ఏ అంశాలు ఉంటే వాళ్ళు తృప్తి చెందుతారో ఆ అంశాలను వకీల్ సాబ్ కథకి జోడించడంలో సక్సస్ అయ్యాడు. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ చాలా బాగా చూపించాడు. ఇక ఫైట్స్ అంటే పవన్ ని ఏ రేంజ్ లో ఊహించకుంటారో అంతకు మించి అన్నట్టుగా డిజైన్ చేశాడు. అలాగే ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్‌ఫెక్ట్ గా కుదిరింది.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్.. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ పక్కాగా రాసుకున్నాడు. శృతి హాసన్ ఉన్నది కాసేపే అయినా ఇది చాలు అన్నట్టుగా చూపించాడు. కంటి పాప సాంగ్ హైలెట్ గా చూపించాడు వేణు శ్రీరాం. ఇక ఫస్టాఫ్ లో పవన్ మీద మరీ ఇంత అభిమానమా అని ప్రేక్షకులు అనుకోక మానరు. అంతగా పవన్ మీద ఫోకస్ చేశాడు వేణు. కానీ సెకండాఫ్ లో కంప్లీట్ గా కథకి తగ్గట్టు బ్యాలెన్స్డ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్ లో ఎమోషన్స్ సీన్స్ తో కట్టి పడేశాడు. సెకండాఫ్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వకీల్ సాబ్ కి పెద్ద ప్లస్ పాయింట్.
ప్లస్ పాయింట్స్..
పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్..
వేణు శ్రీరాం స్క్రీన్ ప్లే..
నివేతా థామస్, అంజలి, అన్నయ ల పర్ఫార్మెన్స్..
కోర్ట్ సన్న్నివేశాలు..
థమన్ ఇచ్చిన మగువ మగువ, కంటి పాప, సత్యమేవ జయతే..అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్..
ఫస్టాఫ్ లో కాస్త బోరింగ్ సీన్స్..
రెగ్యులర్ సీన్స్ ..
పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద చూసి మూడేళ్ళు అవుతోంది. ఈ మూడేళ్ళ నుంచి ఆకలి మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ‘వకీల్ సాబ్’ అందరి ఆకలి తీర్చేసింది. ఇలాంటి సినిమానే అభిమానులు..ప్రేక్షకులు కోరుకుంది. ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత అన్న మాట ఇకపై వినిపించదు. వకీల్ సాబ్ తర్వాత అని చెప్పుకుంటారు. దర్శకుడు వేణు శ్రీరాం పవన్ కళ్యాణ్ కొత్త గా చూపించడం తో సినిమా సక్సస్ అన్న మాట వినిపిస్తోంది. టీజర్, ట్రైలర్ కాదు వకీల్ సాబ్ సినిమా చూడాలి అనే భావన తీసుకు వచ్చాడు. వకీల్ సాబ్ సినిమాలో మాస్ ఆడియన్స్ అండ్ క్లాస్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా పవర్ ప్యాక్డ్ సినిమా వకీల్ సాబ్. ఒకరకంగా వకీల్ సాబ్ స్ట్రైట్ సినిమా గా ఫీలవ్వాల్సిందే.
TheTelugunews.com రివ్యూ రేటింగ్ : 3.50/5
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
This website uses cookies.