Ranabali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ranabali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 January 2026,10:30 pm

ప్రధానాంశాలు:

  •  Ranabaali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..!

Ranabali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో హాట్ టాపిక్‌గా మారాడు. ‘టాక్సీవాలా’ ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో మళ్లీ జతకట్టిన విజయ్, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రణబాలి’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. చరిత్రలో దాగిన చీకటి అధ్యాయం ‘రణబాలి’ గ్లింప్స్ చూస్తే ఇది సాధారణ స్వాతంత్ర్య పోరాట కథ కాదని స్పష్టంగా తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు, బ్రిటీష్ పాలన సమయంలో జరిగిన అణచివేత, దోపిడీ, ప్రజల వేదన – ఇవే ఈ కథకు ప్రధాన నేపథ్యంగా ఉండనున్నాయి.

Ranabali Movie హిస్టారికల్ హీట్ విజయ్ దేవరకొండ రణబాలి మూవీ గ్లింప్స్ రివ్యూ

Ranabali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..!

Ranabali Movie గ్లింప్స్ అదుర్స్..

“ఇది స్వాతంత్ర్య కథ కాదు… దానికి ముందు జరిగిన పోరాటం” అనే డైలాగ్‌తోనే సినిమా టోన్‌ను సెట్ చేశారు మేకర్స్. వారియర్‌గా విజయ్ దేవరకొండ బ్రిటీష్ బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచే ఓ యోధుడిగా విజయ్ దేవరకొండ లుక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ప్రజల నుంచి దోచుకున్న సంపదను తిరిగి ప్రజలకే అందించే తిరుగుబాటు నాయకుడిగా ఆయన పాత్ర ఉంటుందని గ్లింప్స్ సూచిస్తోంది. హింసకు హింసతోనే సమాధానం చెప్పే వారియర్‌గా విజయ్ ప్రెజెన్స్ సినిమా హైప్‌ను మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. విజయ్–రష్మిక కాంబోకు ఇది మూడో సినిమా కాగా, పీరియాడికల్ డ్రామాలో వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. ఆమె పాత్ర కూడా కథలో బలమైన మలుపులు తిప్పనుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కథను రూపొందించినట్లు సమాచారం. వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్ 11న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే గ్లింప్స్‌తో అంచనాలు పెరిగిపోవడంతో, ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందేమో అన్న ఆసక్తి నెలకొంది.

YouTube video

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది