Categories: Newssports

Abhishek Sharma : మ‌రో యువ‌రాజ్ మ‌న‌కు దొరికిన‌ట్టేనా.?

Advertisement
Advertisement

Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ‌.. ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20లో అభిషేక్ శ‌ర్మ బౌండ‌రీల మోత మోగించాడు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త బ్యాట‌ర్ల దెబ్బ‌తో ప‌రుగుల వ‌ర్షం వ‌చ్చింది. ఫోర్లు సిక్స‌ర్ల‌తో టీమిండియా ప్లేయ‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారించారు. కేవ‌లం 6 ఓవ‌ర్ల‌లోనే ఒక వికెట్ కోల్పోయి 95 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ దుమ్మురేపే షాట్ల‌తో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అత‌నికి తోడుగా తిల‌క్ వ‌ర్మ కూడా దుమ్మురేపే షాట్స్ ఆడటంతో భార‌త్ 7 ఓవ‌ర్ లోనే 100 ప‌రుగుల మార్కును దాటింది. ఆ తర్వాత అభిషేక్ దానిని సెంచరీగా మార్చాడు.

Advertisement

Abhishek Sharma : మ‌రో యువ‌రాజ్ మ‌న‌కు దొరికిన‌ట్టేనా.?

Abhishek Sharma యువ‌రాజ్ స్టైల్‌లో..

అభిషేక్ శ‌ర్మ కేవలం 37 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. తొలి 50 పరుగులు చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్ శర్మ, మరో 50 పరుగులు చేసేందుకు 20 బంతులు ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ ఏమాత్రం లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ స్పిన్నర్లను ఈ లెఫ్ట్ హ్యాండర్ చీల్చిచెండాడు. భారీ సిక్సర్లతో హడలెత్తించాడు. ఐసీసీ టెస్టు హోదా ఉన్న దేశాలపై టీ20ల్లో ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇది భార‌త్ త‌ర‌ఫున రెండో ఫాస్టెస్ హాఫ్ సెంచ‌రీగా నిలిచింది.

Advertisement

ఆ త‌ర్వాత కూడా మ‌రింతగా రెచ్చిపోయిన అభిషేక్ శ‌ర్మ ఫోర్లు, సిక్స‌ర్లు బాదడం ఆప‌లేదు. దీంతో కేవ‌లం 37 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. 270 స్ట్రైక్ రేటుతో త‌న బ్యాటింగ్ కొన‌సాగించారు. త‌న ఇన్నింగ్స్ లో 10 సిక్స‌ర్లు, 5 ఫోర్లు బాదాడు. ఇది అభిషేక్ శ‌ర్మ‌కు రెండో టీ20 సెంచ‌రీ. అలాగే, ఇది టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ రెండో సెంచ‌రీగా నిలిచింది. అతని బ్యాటింగ్ స్టైల్.. లెజెండరీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుకు తెచ్చింది. అతని తరహాలోనే లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ. అతని స్టాన్స్, షాట్ సెలెక్షన్, ఫుట్ వర్క్ మొత్తం యూవీని మరిపించేలా సాగింది. ఇదివరకు అభిషేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరించాడు యువరాజ్. దాన్ని అందిపుచ్చుకున్నాడు అభిషేక్.

Advertisement

Recent Posts

Monalisa Bhosle : పుష్ప 2 పోస్టర్ ముందు మోనాలిసా ఫోజులు.. హీరోయిన్ అవ్వగానే లుక్కు మార్చేసిందిగా..!

Monalisa Bhosle : మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా వైరల్ అయిన…

14 minutes ago

Telangana Congress : టి. కాంగ్రెస్ ప‌ట్టు త‌ప్పిందా.. అధికారంలోకి వ‌చ్చాక రేవంత్ రెడ్డికి ఏమైంది..!

Telangana Congress : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చింది. అధికారం కోసం రేవంత్ రెడ్డి…

1 hour ago

Nagababu : పెద్దిరెడ్డి, జ‌గ‌న్, ద్వారపూడి.. ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌లు కురిపించిన నాగ‌బాబు

Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

2 hours ago

Property Rights : అల్లుడికి మామ ఆస్తిపై హక్కులు?.. హైకోర్టు తీర్పు

Property Rights : మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో, 'తల్లిదండ్రుల పోషణ చట్టం ప్రకారం,…

3 hours ago

BRS : కేసీఆర్ మౌనం.. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు…?

BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాది దాటింది. పార్టీపై పట్టు సాధించడానికి పార్టీ అధ్యక్షుడు కె.…

5 hours ago

M Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భగాయతులో 5 ఎకరాల భూమి

M Rajitha Parmeshwar Reddy : రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy  విజ్ఞప్తిపై స్పందించి మంత్రి శ్రీధర్…

6 hours ago

Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. రుద్ర పాత్ర లుక్ అదిరింది..!

Prabhas : మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా Kannappa Movie లో మన రెబల్ స్టార్ ప్రభాస్…

6 hours ago

Anjeer : కేవలం పురుషులకి మాత్రమే ఈ పండు… పవర్ ఫుల్ ఔషధం… దీని ఉపయోగాలు తెలుసా…?

Anjeer  : కొంతమందికి దాంపత్య జీవితంలో అన్యోన్యతలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు మరియు లైంగిక…

7 hours ago