Virat Kohli : దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత కోహ్లీ సెంచ‌రీ.. భార్య ఎమోష‌న‌ల్ అవుతూ షాకింగ్ పోస్ట్

Authored By Sam C | The Telugu News | Published on: September 9, 2022, 5:30 pm

Virat Kohli : క్రికెట్‌లో టాప్ మోస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో విరాట్ కోహ్లీ ఒక‌రు అనే విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల‌ని చెరిపేస్తూ స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో స‌త‌మతం అవుతున్న కోహ్లీ పరుగుల వేటలో ఆకలిగొన్న పులిలా.. ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడి రన్స్ బాదాడు. మునుపటి కోహ్లీని తలపిస్తూ అభిమానులకు అసలైన మజా అందించాడు. ఆసియా కప్‌ 2022 సూపర్‌ 4లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాదాడు. కోహ్లీకి టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ.

Virat Kohli : ప్రేమ కురిపించింది..

2019 నవంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్‌ టెస్టులో శతకం బాదిన విరాట్.. 1021 రోజుల (2022 సెప్టెంబర్ 8) తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. రన్ మెషిన్ 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 71 సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ‘గత మూడేళ్ళుగా బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. అవన్నీ చాలా నేర్పించాయి. నా దృక్పథాన్ని మార్చాయి కూడా. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేస్తాననుకోలేదు. 71వ సెంచరీ చేయడం షాకింగ్‌గా అనిపించింది అని అన్నారు.

Anushka Sharma Emotional Post On Virat Kohli Century

Anushka Sharma Emotional Post On Virat Kohli Century

వంద మార్కును చేరుకున్న వెంటనే మెడలో నుంచి తన భార్య అనుష్క శర్మ ఇచ్చిన లాకెట్‌ను తీసి ముద్దు పెట్టుకున్నాడు కోహ్లీ. త‌న భ‌ర్త చాలా కాలం తరువాత సెంచరీ చేయడంతో అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన భర్తపై ప్రేమను కురిపిస్తూ.. సెంచరీ మూమెంట్ ఫొటోలను షేర్ చేసుకుంది. ‘ప్రతిదీ ఎల్లపుడూ నీతోనే ఉంటుంది..’ అంటూ రాసుకొచ్చింది. హార్ట్ సింబల్‌ను యాడ్ చేసింది. అనుష్క పోస్ట్‌పై సినీ ప్రముఖులతో పాటు విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్ట్ ఎమోజీలతో అనుష్కకు రిప్లై ఇచ్చారు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Anushka Sharma Emotional Post On Virat Kohli Century

Anushka Sharma Emotional Post On Virat Kohli Century

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp